పవన్ కళ్యాణ్ అభిమానితో తమన్నా రొమాన్స్

By Bojja Kumar

'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో గంగ పాత్రలో పవన్‌తో రొమాన్స్ చేయడానికి సైన్ చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా....పవన్ కళ్యాణ్ అభిమానితో కూడా రొమాన్స్‌కు సై అంటోంది. ఇంతకీ ఎవరా అభిమాని అనుకుంటున్నారా..? అతడు ఇంకెవరో కాదు యువ హీరో నితిన్. పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన నితిన్ అయన్ను ఆదర్శంగా తీసుకునే హీరో అయ్యాడు. ఇటీవల తన ఇష్క్ సినిమా ఆడియో వేడుకలో ఈ విషయాన్ని వెల్లడించాడు కూడా.

ఇటీవల విడుదలై విజయవంతంగా నడుస్తున్న 'ఈరోజుల్లో...' చిత్రానికి దర్శకత్వం వహించిన మారుతి దర్శకత్వంలో నితిన్ హీరోగా ఓ చిత్రానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా తమన్నా ఎంపికైనట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. ఈ విషయమై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

ప్రస్తుతం తమన్నా రామ్ చరణ్ సరసన రచ్చ చిత్రం షూటింగులో బిజీగా గడుపుతోంది. ఈ చిత్రంతో పాటు ప్రభాస్ సరసన 'రెబెల్', రామ్ హీరోగా రూపొందుతున్న 'ఎందుకంటే ప్రేమంట', పవర్ స్టార్ సరసన కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రాల్లో నటిస్తోంది తమన్నా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X