హ్యాపీ గర్ల్ తమన్నా..బాలీవుడ్ ఎంట్రీ?
ఓ ప్రక్క అసిన్ 'గజనీ','లండన్ డ్రీమ్స్' తో బాలీవుడ్ లో చెలరేగిపోతూంటే,మరో హీరోయిన్ త్రిష 'కట్టా మీటా' చిత్రంతో పోటీ ఇవ్వటానికి రెడీ అయ్యింది. అలాగే ప్రియమణి..మణిరత్నం 'రావణ'తో హిందిలోకి ప్రవేశించింది. ఇప్పుడు వీరికి తోడుగా తమన్నా కూడా తయారవుతోంది. షారూఖా ఖాన్ హీరోగా చేసే చిత్రంలో ఆమె నటించనుందని సమాచారం. 'జబ్ ఉయ్ మెట్' చిత్రం రీమేక్ 'కందేన్ కాధలై' చూసిన షారూఖ్ ఇంప్రసై ఈ నిర్ణయానికి వచ్చారని తమిళ వర్గాలు చెప్తున్నాయి. ఆ చిత్రానికి ఫర్హాన్ అక్తర్ డైరక్ట్ చేయనున్నారు. ఇక తమన్నా అక్కడ కూడా వర్కవుట్ అయ్యే అవకాశముందని కొన్ని వర్గాలు అంటున్నాయి. ఆల్రెడీ ఆమెకు తమిళంలో మంచి డిమాండు ఉంది. పెద్ద స్టార్స్ అంతా ఆమెను తమ ప్రక్కన రికెమెండ్ చేస్తున్నారు.
హ్యాపీడేస్ తమన్నా శ్రీ గజనీ లండన్ డ్రీమ్స్ అసిన్ త్రిష షారూఖ్ ఖాన్ happy days tamanna sri ghajini london dreams asin trisha shahrukh khan


Click it and Unblock the Notifications