ప్రభాస్ కోసం మహేష్ బాబుకు మస్కా కొట్టింది!

By Bojja Kumar

హైదరాబాద్: మహేష్ బాబు నటించిన 'ఆగుడు' మూవీ ఆడియో వేడుక ఆగస్టు 30న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఆడియో వేడుకకు హాజరు కావాల్సిన ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరైన హీరోయిన్ తమన్నా గైర్హాజరైంది. ఈ విషయం సినీ సర్కిల్‌లో చర్చనీయాంశం అయింది. విషయం ఆరా తీస్తే....తమన్నా గైర్హాజరు వెనక ప్రభాస్ ఉన్నాడని తేలింది.

రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'బాహుబలి'లో ప్రభాస్ సరసన తమన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'బాహుబలి' షూటింగ్ మహాబలేశ్వర్‌లో జరుగుతోంది. దీంతో 'ఆగడు' ఆడియో వేడుకకు హాజరయ్యే పరిస్థితి లేకుండా పోయింది. సో...అలా ప్రభాస్ సినిమాలో నటించడం కోసం మహేస్ బాబు 'ఆగడు' ఆడియో వేడుకకు మస్కా కొట్టింది తమన్నా.

Tamanna Skips Aagadu Audio Function for Baahubali

ఆగడు సినిమా విషయానికొస్తే....'దూకుడు' వంటి భారి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్ బాబు, శ్రీను వైట్ల, తమన్ కాంబినేషన్లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాపై అభిమానులలో భారి అంచనాలున్నాయి. ఈ చిత్రానికి అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు. సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X