నాగచైతన్య-తమన్నాల '100% లవ్' చిత్రంలో ఆ సీన్ కట్..!
యువ హీరో నాగచైతన్య, పంజాబీ ముద్దుగుమ్మ తమన్నాలు జంటగా నటించిన చిత్రం '100% లవ్'లో ఎగ్జామ్ ఎలా కాపీ కొట్టాలనే విధానాన్ని తమన్నా కొత్తగా చూపించింది. నడుంపై ఓ ఫార్ములా రాసుకొని వచ్చి తన బావ (నాగచైతన్యు)కు రెండు చేతులు పైకెత్తి నడుం కనపడేలా చూపిస్తుంది. అయితే ఈ చిత్రంలో సదరు సన్నివేశాన్ని తీసేయాలంటూ మహిళా సంఘాలు గొంతెత్తడంతో నిర్మాత దిగొచ్చారు. దీంతో సినిమాలో తమన్నా-నాగచైతన్యల మధ్య జరిగే ఆ సన్నివేశాన్ని నిర్మాత కట్ చేయించారు.
గడచిన రెండు రోజులలో 100% లవ్ సినిమా చూసిన వారు ఈ మార్పును గమనించవచ్చు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా టెలివిజన్లలో కూడా ఈ సన్నివేశం ప్రసారం అవుతుండటంతో మహిళా సంఘాల వారు దీన్ని సీరియస్‌గా తీసుకొన్నారు. మహిళా సంఘాల డిమాండును దృష్టిలో ఉంచుకొని నిర్మాత ఈ సన్నివేశాన్ని తొలగించారు. కానీ ఈ సన్నివేశం ఇప్పటికీ టెలివిజన్లలో మాత్రం ప్రసారం అవుతూనే ఉంది. ఇంకా వాల్‌పోస్టర్లపై కూడా ఆ నడుం సీన్ అలానే ఉంది.


Click it and Unblock the Notifications











