twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వివి వినాయిక్ దర్శకత్వంలో మరోసారి తమన్నా

    By Srikanya
    |

    హైదరాబాద్: వివి వినాయిక్ దర్శకత్వంలో మరోసారి తమన్నా నటించనుంది. గతంలో ఆమె బద్రీనాధ్ చిత్రంలో చేసింది. ప్రస్తుతం బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రంలో సమంత ప్లేసు లోకి ఆమెను తీసుకునే అవకాసం ఉందని తెలుస్తోంది. బెల్లంకొండ కుమారుడు శ్రీనివాస్... హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో సమంతని మొదటి ఎన్నుకున్నారు. కానీ..ఇప్పుడు ఆమె తప్పుకునే అవకాసం ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే అదేమీ లేదని సమంత,తమన్నా ఇద్దరూ సినిమాలో చేస్తున్నారని కొందరంటున్నారు.

    ఈ చిత్రం భారీగా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనుందని తెలుస్తోంది. వివి వినాయిక్ తొలిసారిగా ఓ కొత్త హీరోతో పనిచేయబోతున్నారు. బెల్లంకొండ సురేష్ తో తనకు ఉన్న అనుభందంతోనే ఈ ప్రాజెక్టు ఓకే చేసినట్లు సమాచారం. నాయక్ చిత్రం తర్వాత వినాయిక్ చేస్తున్న చిత్రం ఇదే. వినాయిక్ మొదటి చిత్రం ఆదికి నిర్మాత బెల్లంకొండ సురేష్ బ్యానర్ మీదే చేయటంతో ఆ అనుబంధం ఇలా కొనసాగుతోంది.

    ఎమ్ ఎస్ రాజు తన కుమారుడుని హీరోగా లాంచ్ చేసిన సమయంలో చాలామంది నిర్మాతలు తమ కుమారులను కూడా హీరోగా ల్యాంచ్ చేసి హ్యాపీగా ఉందామనే నిర్ణయానికి వచ్చారు. వేరే ఎవరో హీరో మీద పెట్టుబడి పెట్టడం కన్నా తన కుమారుడునే హీరో చేస్తే బెస్ట్ అని డేట్స్ సమస్యలు అవీ ఉండవని, అల్లు అరవింద్, రామానాయుడు వంటి వారు అలా తమ కుమారులను హీరో చేసే ఏ ఇబ్బందీ లేకుండా ప్రొడక్షన్ చేసుకున్నారని భావిస్తున్నారు. దానికి తోడు బెల్లంకొండ కుమారుడు ఇందుకోసం డైలీ జిమ్ కు వెళ్లటం, యాక్టింగ్ క్లాసులకు వెళ్లటం వంటివి చేసి ప్రిపేర్ అయ్యారు. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

    English summary
    VV Vinayak is directing a film for producer Bellamkonda Suresh. Tamanna has also joined the film. We do not know if Tamanna is enacting the role that originally planned for Samantha or of both have equally meaty role in the film. Tamanna was earlier featured in Vinayak's film Badrinath too. Watch this space, we shall update you soon with more details.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X