twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్-సుకుమార్ మూవీలో ఫైనల్‌గా ఆమెనేనా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో రూపొందబోయే సినిమాకు సంబంధించిన హీరోయిన్ మ్యాటర్‌పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. తొలుత తమన్నాను హీరోయిన్‌గా అనుకోగా డేట్స్ కుదరక పోవడం వల్ల కాజల్‌ని ఎంపిక చేసారు. ఆ తర్వాత కాజల్‌ను ఫైనల్ చేసినా అమె కూడా హ్యాండ్ ఇచ్చింది. నిన్న బాలీవుడ్ బేబీ దీపిక పడుకొనె పేరు వినిపించినా ఇంకా ఈ విషయమై క్లారిటీ రాలేదు. అయితే ఈ వ్యవహారం తిరిగి తిరిగి మళ్లీ తొలుత అనుకున్న తమన్నా వద్దకు చేరినట్లు తెలుస్తోంది.

    వాస్తవానికి సుకుమార్ ఈ చిత్రాన్ని ముందుగానే మొదలు పెట్టాల్సి ఉన్నా అనేక కారణాల వల్ల మొదలు పెట్టలేక పోయాడు. వివిధ కారణాల వల్ల షూటింగ్ లేటవుతూనే వస్తోంది. గతంలో సుకుమార్ అనుకున్న సమయానికి తమన్నాను డేట్స్ అడగ్గా ఆమెకు కెమెరామెన్ గంగతో రాంబాబు, రెబల్ షూటింగుల వల్ల డేట్స్ అడ్జెస్ట్ కాలేదు.

    అయితే సుకుమార్ ఈ చిత్రం షూటింగులు లేటుగా మొదలు పెడుతుండటంతో తమన్నా డేట్స్ కూడా ఆ సమయానికి ఖాళీగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఫైనల్ గా తమన్నానే తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం ఇంకా ఖరారు కావాల్సి ఉంది.

    ఈ చిత్రం 2013 వేసవికి విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రొమాంటిక్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపుపొందిన సుకుమార్ దర్శకత్వంలో మహేష్‌ బాబు తొలిసారిగా నటిస్తుండటంతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది.

    English summary
    Finally, Kajal has walked out and Tamanna is expected to take that place in Mahesh-Sukumar movie. If that happens it will be the first time both Mahesh Babu and Tamanna would be pairing up with each other.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X