హైదరాబాదీ అబ్బాయితో స్టార్ హీరోయిన్ ప్రేమయాణం.. స్టార్ లవ్ బర్డ్స్ మ్యారేజ్ ఎప్పుడంటే..?
సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీల మద్య లవ్ అఫైర్స్, మ్యారేజ్, బ్రేకప్స్ ఇవన్నీ కామన్. ఇలాంటి విషయాలే సెలబ్రెటీలకు మరింత పాపులారిటీని తెచ్చిపెడుతాయి. అలా పాపులారిటీ తెచ్చుకున్న వారెందరో ఉన్నారు. ఇండస్ట్రీలో వారు తమ కో స్టార్స్ తోనే లేదా ఇతర వ్యక్తులతో రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తుంటారు. మరికొందరూ తమ ప్రేమ బంధాన్ని పెళ్లి పీటల వరకూ తీసుకెళ్లాడు. అలా ప్రేమబంధాన్ని పెళ్లి పీటల వరకూ తీసుకెళ్లానని భావిస్తుంది? త్వరలో తమ ప్రేమను వివాహ బంధంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తుంది. అది కూడా మన హైదరాబాదీ అబ్బాయినే ప్రేమించి పెళ్లి చేసుకోబోతుంది. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే?
ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు... టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా. మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టి ఈ అమ్మడు వరుస విజయాలు అందుకుంటూ స్టార్ట్ హీరోయిన్ మారింది. బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలను తెచ్చుకుంటూ. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటుంది. కేవలం సినిమాల్లోనే కాకుండా.. ఓటీటీ వెబ్ సిరీస్ లు, షోలోలకు హోస్టులుగా వ్యవహరిస్తూ తన సత్తా చాటుతోంది. వాస్తవానికి తమన్నా.. మంచు మనోజ్ హీరోగా నటించిన 'శ్రీ' అనే మూవీతో టాలీవుడ్ కు పరిచయమైంది ఈ బ్యూటీ. ఆ తరువాత శేఖర్ కమలా డైరెక్షన్ లో వచ్చిన 'హ్యాపీ డేస్'అనే మూవీలో నటించి మెప్పించింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో వరుస అవకాశాలు దక్కించుకుంది.

ఈ సమయంలో చిరంజీవీ, నాగార్జున, నాగార్జున, మహేశ్ బాబు,అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో నటించి వరుస విజయాలను అందుకుంది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ అమ్మడు కేవలం తెలుగు సినిమాల్లోనే కాకుండా.. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ నటించి మెప్పించింది. ఇటీవల ఇక తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ మూవీలో 'కావాలయ్యా..'అంటూ స్పెషల్ సాంగ్ లో మాస్ స్టెప్పులేస్తూ రెచ్చిపోయి.. తమ గ్లామర్ షోతో టాక్ ఆఫ్ దీ సెన్సేషన్ గా మారింది. ఇక స్ట్రీ 2 సినిమాలో కూడా ఓ ఐటమ్ సాంగ్ నటించి తన అందాల ఆరబోతతో బీ టౌన్ ప్రేక్షకులకు చెమటలు పట్టించింది. రీసెంట్ గా సికందర్ కా ముఖద్దర్ అనే మూవీలో తమన్నా లీడ్ లో నటించింది. ఈ మూవీ నవంబర్ 29నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక తమన్నా అప్ కమ్మింగ్ సినిమాల విషయానికి వస్తే.. 'ఓదెల 2' అనే మూవీలో మెయిన్ రోల్ లో నటిస్తోంది. ఆ తరువాత కరణ్ జోహార్ బ్యానర్‌పై రూపొందుతున్న 'డేరింగ్ పార్ట్‌నర్స్'లో కూడా నటించబోతుంది.
మిల్క్ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీ అడుగుపెట్టి దాదాపు 20 ఏండ్లు అవుతున్న చెరగని అందం ఆమె సొంతం. ఈ అమ్మడు హైదరాబాద్ అబ్బాయి, బాలీవుడ్ స్టార్ హీరో విజయ్ వర్మతో లవ్ ట్రాక్ నడుపుతోందని బీ టౌన్ లో జోరుగా సాగుతోంది. వీరిద్దరూ గత రెండు సంవత్సరాలుగా పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. చాలా కాలంగా డేటింగ్ లో ఉన్న ఈ జంట ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. వీరి పెళ్లి గురించి తాజాగా పలు వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకానొక సందర్భంలో పెళ్లి గురించి విజయ్ వర్మ కౌంటర్ ఇవ్వడంతో మళ్లీ ఆ ప్రస్తావన ఎక్కడా వినిపించలేదు. కానీ, తాజాగా మరోసారి ఈ లవ్ బర్డ్స్ పెళ్లి విషయం చర్చలోకి వచ్చింది.

తాజాగా హీరోయిన్ తమన్నా- విజయ్ వర్మలు 2025లో పెళ్లి చేసుకోబోతున్నారంటూ బాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే పెళ్లికాక ముందుకే కొత్త కాపురం పెట్టాలని వీళ్లు భావిస్తున్నట్టు.. కొత్త ఇంటి కోసం ముంబైలోని బాంద్రాలో ఈ స్టార్ కపుల్స్ విలాసంతమైన అపార్ట్మెంట్ కోసం సర్చ్ చేస్తున్నారని బాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. అంటే.. పెళ్లి కాకముందుకే కొత్త ఇంట్లో అడుగు పెట్టాలని భావిస్తున్నారట. అయితే.. ఈ వార్తపై తమన్న గాని, అటు విజయ్ వర్మ గాని స్పందించలేదు. మరొకవైపు వీరి అభిమానులు పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు .
ఇక విజయ్ వర్మ విషయానికొస్తే. ఈ నటుడు హైదరాబాదీనే. హైదరాబాదులో నే పుట్టి పెరిగిన విజయ వర్మ పునాలోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో యాక్టింగ్ నేర్చుకున్నారు. తర్వాత 'గల్లీ బాయ్స్' అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆయన కెరీర్లో మీర్జా పూర్, ఐసి 814 వంటి సినిమాలు మంచి పాపులా అంటేనే తీసుకువచ్చాయి. వీరి ప్రేమ, పెళ్లి వార్తలపై క్లారిటీ రావాలంటే.. వీరిలో ఎవరైనా క్లారిటీ ఇవ్వాల్సిందే. అప్పటి వరకూ ఇలాంటి రూమర్స్ వస్తూనే ఉంటాయి.


Click it and Unblock the Notifications











