ఆ హీరోతో తమన్నా రిలేషన్?.. భర్తపై హీరో భార్య నిఘా పెట్టి..
ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ హాట్ టాపిక్‌గా మారిన అంశం ఏదైనా ఉందంటే అది తమన్నా - విజయ్ వర్మల బ్రేకప్పే. రేపో మాపో పెళ్లి చేసుకుని గుడ్ న్యూస్ చెబుతారనుకుంటే బ్రేకప్ న్యూస్‌తో ఇండస్ట్రీకి, అభిమానులకు షాకిచ్చారు తమన్నా - విజయ్. వీరు విడిపోయారంటే ఇప్పటికీ చాలా మంది నమ్మడం లేదు. కానీ ఎవరి దారులు వారు వెతుక్కున్నట్లుగా జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు కంప్లీట్ చేసే పనిలో వీరిద్దరూ ఉన్నారు.
విడిపోయిన తర్వాత ఇద్దరూ ఒకరి సోషల్ మీడియా ఖాతాలో మరొకరి ఫోటోలను తొలగించడంతో పాటు ఫంక్షన్లు, పార్టీలకు ఇద్దరూ వేర్వేరుగా హాజరవుతున్నారు. రవీనా టాండన్ ఇంట్లో జరిగిన హోలీ వేడుకల్లో వీరు విడివిడిగా పాల్గొన్నారు. వీరి బ్రేకప్‌కు ఇప్పటి వరకు సరైన కారణం తెలియరాలేదు. అయితే తమన్నా త్వరగా పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిలైపోదామని చెప్పగా.. విజయ్ మాత్రం కెరీర్‌పై ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకోవడమే వీరు విడిపోవడానికి కారణంగా బీటౌన్ మీడియా కోడై కూస్తోంది.

ప్రస్తుతం తమన్నా ఓదెల 2 చిత్రంలో నటిస్తున్నారు. తొలుత ఈ చిత్రాన్ని తెలుగుకే పరిమితం చేయగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇందులో అఘోరా పాత్రలో తమన్నా భాటియా కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు, ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ పతాకాలపై ఓదెల 2ను నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 17న ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఓదెల 2 ఓటీటీ రైట్స్‌కు ఫ్యాన్సీ ధర దక్కినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక విజయ్ విషయానికి వస్తే ఉల్ జలూల్ ఇష్క్ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్లుగా టాక్.
తమన్నా - విజయ్ వర్మల బ్రేకప్ నేపథ్యంలో తమన్నాకు సంబంధించిన పాత విషయాలు వైరల్ అవుతున్నాయి. అదే తమన్నా ప్రేమ వ్యవహారం. విజయ్ కంటే ముందే తమన్నా ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడిందని గాసిప్స్ బయటికి వస్తున్నాయి. ఆ హీరో ఎవరో కాదు తమిళ నటుడు కార్తీ. దీనికి కారణాలు లేకపోలేదు.. వీరిద్దరూ కలిసి కో, సిరుత్తై, ఊపిరి, పయ్యా తదితర చిత్రాల్లో నటించారు. అది కూడా బ్యాక్ టూ బ్యాక్ స్క్రీన్‌ను షేర్ చేసుకోవడంతో వీరిద్దరూ ప్రేమలో పడ్డారంటూ మీడియా కోడై కూసింది.
అప్పట్లోనే ఓ ఇంటర్వ్యూలో తమన్నాతో తాను రిలేషన్‌లో ఉన్నట్లుగా వస్తున్న వార్తలపై కార్తీ స్పందించారు. తామిద్దరం అప్పుడే కెరీర్‌లో పైకి వస్తున్నామని, అప్పటికే పెళ్లి కావడంతో రొమాంటిక్ సీన్స్‌లో హీరోయిన్లను టచ్ చేయకుండా యాక్ట్ చేయాలంటూ తన భార్య గొడవ పడేదని కార్తీ తెలిపారు. నా సినిమాలలో అలాంటి సీన్స్ వస్తే చూడొద్దని చెబుతానని ఆయన వెల్లడించారు. కార్తీతో రిలేషన్ వార్తలపై కొన్నేళ్ల క్రితమే తమన్నా కూడా స్పందించారు. తమపై అలాంటి వార్తలు ఎందుకొచ్చాయో తెలియదని, కానీ ఒకసారి మీడియాకు దొరికితే వదిలిపెట్టరని తమన్నా వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











