Tamannaah: తెలుగు నటుడితో తమన్నా వివాహం.. నిశ్చితార్థానికి స్పెషల్ డేట్! ఆ రోజున పెళ్లి?

మంచు హీరో మనోజ్ శ్రీ సినిమా ద్వారా పరిచయం అయిన గ్లామరస్ బ్యూటి తమన్నా. హ్యాపీడేస్ సినిమాతో యూత్ లో చెరగని ముద్ర వేసుకుంది. పుష్కర కాలంగా తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో సత్తా చాటుతూ దూసుకుపోతోంది ఈ మిల్కీ బ్యూటి. ఇక గ్లామర్ ప్రపంచంలో ప్రేమాయణాలు, రిలేషన్ షిప్స్, ఎంగేజ్ మెంట్, పెళ్లిల్లు, విడాకులు కామన్. అవి ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవ్వరూ ఊహించని పరిస్థితి నెలకొంది. అయితే బాయ్ ఫ్రెండ్, పెళ్లి విషయాలు రూమర్స్ అంటూ చెప్పుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల నటుడు విజయ్ వర్మతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీళ్లిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా నిశ్చితార్థం, పెళ్లికి తేదీలు కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.'

అనేక చిత్రాలతో సత్తా చాటుతూ..

అనేక చిత్రాలతో సత్తా చాటుతూ..

మోస్ట్ గ్లామరస్ బ్యూటి తమన్నా శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమా హ్యాపీ డేస్ తో యువత హృదయాలను కొల్లగొట్టింది. ఇండస్ట్రీకి వచ్చిన 17 ఏళ్లలో సుమారు 50కిపైగా చిత్రాల్లో నటించి అలరించింది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ సినిమాల్లో కూడా ఆకట్టుకుంటూ తన సత్తా చాటుతోంది మిల్కీ బ్యూటి తమన్నా. ఇటీవల తెలుగులో వెంకటేష్ సరసన F3 సినిమాలో నటించి ఫన్ అందించింది.

రజనీ కాంత్ సినిమాలో..

రజనీ కాంత్ సినిమాలో..

అలాగే నేరుగా ఓటీటీలో విడుదలైన బబ్లీ బౌన్సర్ సినిమాతో ఇటు తెలుగు అటు హిందీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం మిల్కీ బ్యూటీ చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలో నటించనుంది. అలాగే సూపర్ స్టార్ రజనీ కాంత్-నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న జైలర్ చిత్రంలో కూడా అలరించనుంది ఈ భామ.

పెళ్లిపై స్ట్రాంగ్ కౌంటర్..

పెళ్లిపై స్ట్రాంగ్ కౌంటర్..

ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉన్న బ్యూటిఫుల్ తమన్నాకు గత కొంత కాలంగా రూమర్స్ బెడద అంటుకుంది. ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ అబ్బాయితో డేటింగ్ చేస్తోందని వార్తలు కాగా ఓ ఇంటర్వ్యూలో ఖండించింది. అలాగే ముంబైకి చెందిన బిజినెస్ మ్యాన్ తో పెళ్లి జరగనుందని కూడా వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు F 3 సినిమాలో మేల్ గెటప్ ను చూపించి అతడే తనకు కాబోయే భర్త అని చెప్పి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది.

పబ్లిక్ లో ముద్దులు పెడుతూ..

పబ్లిక్ లో ముద్దులు పెడుతూ..

అయితే ఇటీవల తమన్నా చాలా గట్టిగా దొరికిపోయింది. తమన్నా పాపులర్ నటుడు విజయ్ వర్మకు పబ్లిక్ లో ముద్దులు పెడుతూ, హగ్ లు ఇస్తూ రెచ్చిపోయింది మిల్కీ బ్యూటి. గోవాలో జరుపుకున్న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో నటుడు విజయ్ వర్మకు తమన్నా లిప్ లాక్ ఇచ్చిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా వీళ్లిద్దరు కలిసి అనేక ఫంక్షన్స్ కు అటెండ్ అయ్యారు. ఆ పిక్స్ కూడా సోషల్ మీడియా ట్రెండ్ అయ్యాయి.
సైకో భర్తగా విజయ్ వర్మ..

ప్రేమికుల దినోత్సవం రోజున..

ప్రేమికుల దినోత్సవం రోజున..

అయితే ఇప్పుడు విజయ్ వర్మను తమన్నా పెళ్లాడనుందని బాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంగేజ్ మెంట్ చేసుకోవాలని ఫిక్స్ అయిందట కిస్సింగ్ జంట. ఈ నిశ్చితార్థం కోసం స్పెషల్ డేట్ ను సెలెక్ట్ చేసుకున్నారట మిల్కీ బ్యూటీ తమన్నా, నటుడు విజయ్ వర్మ. ఫిబ్రవరి 14న అంటే ప్రేమికుల దినోత్సవం రోజుని తమన్నా-విజయ్ వర్మ నిశ్చితార్థం చేసుకోనున్నారని బాలీవుడ్ సినీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం.

ఆరోజు తమన్నా వివాహం..

ఆరోజు తమన్నా వివాహం..

ఫిబ్రవరి 14 రోజున ఎంగేజ్ మెంట్ ను ఫిక్స్ చేయడంతోపాటు పెళ్లి తేదీని సైతం ఖరారు చేశారట తమన్నా అండ్ విజయ్ వర్మ. వీరిద్దరు ఏప్రిల్ 21 పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు హిందీ చిత్ర పరిశ్రమలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సో ఇంతకాలం వాళ్లు కలిసి హగ్గులు, కిస్సులు ఇచ్చుకుంది ఈ పెళ్లి సారాంశమే అని పలువురు అనుకుంటున్నారు. అయితే తమన్నా ఎంగేజ్ మెంట్, పెళ్లి తేదీలు ఖరారుపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇలాంటి ప్రచారాలపై తమన్నా ఇప్పటికే పలుసార్లు సీరియస్ అయింది. ఈసారి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.

 హైదరాబాదీ నటుడితో..

హైదరాబాదీ నటుడితో..

ఇదిలా ఉంటే తమన్నా లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ రెండో సీజన్ లో నటించేటప్పుడు విజయ్ వర్మతో పరిచయం ఏర్పడిందని సినీ వర్గాల సమాచారం. ఇక హైదరాబాద్ కు చెందిన విజయ్ వర్మ ఎక్కువగా బాలీవుడ్ సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయ్యాడు. విజయ్ వర్మ పలు తెలుగు సినిమాల్లో సైతం నటించాడు. నేచురల్ స్టార్ నాని నటించిన ఏసీఏ సినిమాలో విలన్ గా చేశాడు. అలియా భట్ డార్లింగ్స్ సినిమాలో సైకో భర్తగా అలరించాడు. మీర్జాపూర్ రెండో సీజన్, షీ వెబ్ సిరీస్ లో కూడా ఆకట్టుకున్నాడు విజయ్ వర్మ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X