నిర్మాతకు షాకిచ్చిన తమన్నా.. రెమ్యునరేషన్ వివాదంలో మిల్కి బ్యూటీ

అందాల భామ తమన్నా భాటియా F2 విజయం తర్వాత జోష్ పెంచారు. అలాగే సైరా సినిమా తర్వాత మళ్లీ తెలుగులో కనిపించకపోయినా సీనియర్ హీరోయిన్ రేటు బాగానే పెంచినట్టు తెలిసింది. బాలీవుడ్, తమిళ చిత్రాలపైనే ఆశలు పెట్టుకొన్న ఈ బ్యూటీ ఇప్పుడు భారీ రేటుతో మోత మొగిస్తున్నట్టు సమాచారం. తాజాగా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో నిర్మాతలు కంగు తిన్నారంట. ఆ మొత్తాన్ని చెల్లించుకోలేనమని చెప్పడంతో తమన్నా ఆ సినిమాకు గుడ్‌బై కొట్టేసిందట. ఇంతకు ఆ సినిమా ఏమిటంటే..

స్పెషల్ సాంగ్‌తో దుమ్ము రేపి..

స్పెషల్ సాంగ్‌తో దుమ్ము రేపి..

ఇటీవల కాలంలో ఎఫ్‌2, సైరా నర్సింహారెడ్డి చిత్రాల్లో తమన్నా ఫెర్ఫార్మెన్స్‌కు బ్రహ్మండమైన పేరు వచ్చింది. అలాగే సరిలేరు నీకెవ్వరు చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో దుమ్మురేపింది. తమిళంలో పెట్రోమాక్స్, యాక్షన్ సినిమాలు అంతగా పేరు తీసుకురాకపోయినా ఆమె కెరీర్ గ్రాఫ్‌కు దెబ్బ పడలేదు. ఇలాంటి సమయంలో స్టార్ హీరోలతో జతకడుతున్న ఈ భామ తన పారితోషికాన్ని భారీగా పెంచేసిందంట.

రవితేజతో బెంగాల్ టైగర్ నుంచి

రవితేజతో బెంగాల్ టైగర్ నుంచి

తమన్నా భాటియా, రవితేజకు ప్రొఫెషనల్ పరంగా మంచి రిలేషన్స్ ఉన్నాయి. మొదటి నుంచి తమన్నాను రవితేజ ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. బెంగాల్ టైగర్ సినిమా షూటింగ్‌లో జరిగిన పరిచయం వారిద్దరి మధ్య మంచి బాండింగ్‌ను క్రియేట్ చేసింది. అప్పటి నుంచి రవితేజతో స్నేహపూర్వకమైన రిలేషన్స్ కొనసాగిస్తున్నారు. తమన్నా పలుమార్లు రవితేజ నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.

తాజా రవితేజ చిత్రంలో

తాజా రవితేజ చిత్రంలో

తాజాగా రవితేజ తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు త్రినాథరావు నక్కినతో చేయనున్నారు. ఈ సినిమాలో మాస్ మహారాజా పక్కన తమన్నాకు అవకాశం ఇవ్వాలని అనుకొన్నారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీకి మంచి ప్రేక్షకాదరణ ఉండటంతోపాటు హిట్ జంటగా పేరు ఉండటంతో కలిసి వస్తుందని అనుకొన్నారు. ఇటీవల చేసిన F2లో కూడా తమన్నా నటనకు మంచి పేరు వచ్చింది. ఈ క్రమంలో రవితేజ్‌ బెస్ట్ జోడి అని యూనిట్ ఫీలయ్యారు.

అఫీషియల్ కన్ఫర్మేషన్ లేకపోవడంతో

అఫీషియల్ కన్ఫర్మేషన్ లేకపోవడంతో


అయితే రెమ్యునరేషన్ విషయంలో తేడాలు రావడంతో రవితేజ సినిమా నుంచి రవితేజ తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ సినిమా కోసం రూ.3 కోట్లు డిమాండ్ చేస్తే.. ఆమెకు రూ.2.5 కోట్లు ఇస్తామని నిర్మాత స్పష్టం చేయగా అందుకు ఒప్పుకోక పోవడం జరిగిందట. దాంతో ఈ సినిమా నుంచి బయటకు వెళ్లిందనే ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ వార్తపై చిత్ర యూనిట్ గానీ, తమన్నా గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఈ వార్తపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Recommended Video

KGF Star Yash’s Next Movie Update | Filmibeat Telugu
తమన్నా కెరీర్ ఇలా

తమన్నా కెరీర్ ఇలా

తమన్నా కెరీర్ విషయానికి వస్తే.. బోల్ చుడియా అనే హిందీ చిత్రంలో నటిస్తున్నది. అలాగే సంపత్ నంది రూపొందించే సీటిమార్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే క్వీన్ రీమేక్ దటీజ్ మహాలక్ష్మీ అనే చిత్రం ఎప్పటి నుంచి రిలీజ్ కాకుండా ఆగిపోయింది. అలాగే హాట్ స్టార్ రూపొందిస్తున్న ది నవంబర్స్ స్టోరీ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X