NBK109: బాలయ్య మూవీలో స్టార్ హీరోయిన్ ఐటెం సాంగ్.. అదే జరిగితే నందమూరి రికార్డే!
ఆరు పదుల వయసులోనూ ఉరకలేసే కుర్రాళ్ల మాదిరిగా ఏకధాటిగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. దీనికితోడు ఈ మధ్య కాలంలో ఆయన వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌తో కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే ఆయన 'భగవంత్ కేసరి'తో హ్యాట్రిక్‌ను నమోదు చేశారు.
ఈ మధ్య కాలంలో విజయాల పరంపరతో యమ జోష్‌లో ఉన్న నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడు తన 109వ సినిమాను బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో చేస్తున్నాడు. చాలా రోజుల క్రితమే ఈ మూవీ పూజా కార్యక్రమాలు పూర్తి అయిపోయాయి. ఇక, ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను సైతం మొదలు పెట్టిన విషయం తెలిసిందే.

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం 1980 దశకం నాటి కథతో రూపొందబోతున్నట్లు ఇప్పటికే రివీల్ అయింది. అందుకు తగ్గట్లుగానే ఇటీవలే వచ్చిన పోస్టర్లు డిజైన్ చేశారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరుగుతూనే ఉన్నాయి. దీనికి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపొందిస్తున్నారు.
బాలయ్య కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్లుగా ఎవరు చేస్తారన్న దానిపై ఎన్నో రకాల ఊహాగానాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇందులో త్రిష, మీనాక్షి చౌదరిలను ఫిక్స్ చేశారని ఓ న్యూస్ వైరల్ అయింది. అలాగే, ఓ ముఖ్యమైన పాత్ర కోసం ప్రియమణిని కూడా తీసుకున్నారని ఇటీవలే ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరిగింది.

ఇక, ఈ క్రేజీ సినిమాలో స్పెషల్ సాంగ్ గురించి కూడా చాలా ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై ఓ క్రేజీ న్యూస్ లీకైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బాలయ్య సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం తమన్నాను సంప్రదించగా.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఇదే జరిగితే తారక్, కల్యాణ్ రామ్, బాలయ్యలతో చేసిన హీరోయిన్‌గా నిలుస్తుంది.
ఇదిలా ఉండగా.. విభిన్నమైన యాక్షన్‌తో డిఫరెంట్ కాన్సెప్టుతో రాబోతున్న ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఊటీలో జరుగుతున్నట్లు తెలిసింది. ఇందులో ఊర్వశీ రౌటేలా కూడా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











