రామ్ చరణ్‌తో ఫైట్‌కు తమన్నా రెడీ: టాలీవుడ్‌లో ఈ వార్తే ఇప్పుడు హాట్ టాపిక్

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'వినయ విధేయ రామ' వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా థియేటర్లలోకి రాలేదు. అయితే, అతడు ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. అందులో ఒకటి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRR (రౌద్రం రుధిరం రణం). ఇందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక, చరణ్ ప్రస్తుతం నటిస్తోన్న మరో చిత్రమే 'ఆచార్య'. మెగాస్టార్ చిరంజీవి ఇందులో హీరోగా నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల షూటింగ్‌లు ఇప్పుడు దాదాపు పూర్తి అయ్యాయి.

'RRR', 'ఆచార్య' తర్వాత రామ్ చరణ్ నటించబోయే ప్రాజెక్టు గురించి చాలా కాలంగా భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది దర్శకులు పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, ఊహించని విధంగా ఈ మెగా హీరో.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. దీన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నారు. త్వరలోనే ఈ భారీ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది.

Tamannaah Bhatia to play Negative Role in Ram Charan - S. Shankar Movie

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ భారీ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ నటిస్తుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే, ఇటీవలే ఆమె స్థానంలో కన్నడ పిల్ల రష్మిక మందన్నాను తీసుకున్నారని వార్తలు వచ్చాయి. దీని తర్వాత మరికొన్ని పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే, ముందు నుంచీ అనుకున్నట్లుగానే కియారానే దీని కోసం తీసుకున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటన కూడా అధికారికంగా వెలువడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఓ ఆసక్తికరమై న్యూస్ వైరల్ అవుతోంది.

తాజా సమాచారం ప్రకారం.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తుందట. ఆమె ఎవరో కాదు.. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. అవును.. ఈ మూవీలో ఎంతో ప్రాధాన్యత ఉన్న విలన్ భార్య పాత్రలో ఆమె కనిపించబోతుందని తెలుస్తోంది. ఇక, ఈ రోల్ నెగెటివ్ షేడ్స్‌తో కూడి ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. అంటే.. ఈ సినిమాలో రామ్ చరణ్‌తో ఆమె ఢీ కొట్టబోతుందన్న మాట. అంతలా ఈ బ్యూటీ ఇందులో పవర్‌ఫుల్‌గా కనిపించనుందని ప్రచారం జరుగుతోంది. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో 'రచ్చ' అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీన్ని 'ఒకే ఒక్కడు' స్టైల్‌లో చిత్రీకరించబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ సినిమాకు కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథను అందిస్తున్నాడు. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందనుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌ ఇండస్ట్రీలకు చెందిన ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తున్నట్లు ఎప్పటి నుంచో జోరుగా వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X