విజయ్ వర్మతో బ్రేకప్.. V లెటర్ తమన్నాకు కలిసిరాదా?.. 12 ఏళ్ల క్రితం ఆ స్టార్‌తోనూ

గత కొద్దిరోజులుగా భారతీయ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది తమన్నా - విజయ్ వర్మ బ్రేకప్. దాదాపు మూడేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఉన్నట్లుండి విడిపోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. రేపో మాపో పెళ్లి చేసుకుంటారని అంతా ఫిక్స్ అయితే తమన్నా - విజయ్‌లు కటీఫ్ చెప్పుకున్నారు. వీరి మధ్య మనస్పర్ధలకు, దూరానికి దారి తీసిన కారణాలు ఇంత వరకు తెలియరాలేదు. ఎవరికి నచ్చిన విధంగా వారు కథలు అల్లేస్తున్నారు.

లస్ట్ స్టోరీస్ 2 సమయంలో తమన్నా - విజయ్ వర్మల మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఇద్దరూ పబ్లిక్‌గానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ మీడియా కంటపడ్డారు. అయితే ఓ రోజున తమ ప్రేమను వీరు వ్యక్తపరిచారు. నాటి నుంచి వెకేషన్లు, పార్టీలు ఏ కార్యక్రమం జరిగినా కలిసి మెలిసి జంటగా హాజరయ్యేవారు. ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్‌లలో సెలబ్రెటీలు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటూ ఉండటంతో తమన్నా - విజయ్‌లు కూడా త్వరలోనే శుభవార్త చెబుతారని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఇద్దరి మధ్య బ్రేకప్ జరగడం , ఎవరి దారులు వారికి వేరవ్వడం చకచకా జరిగిపోయాయి.

tamannaah bhatia vijay varma breakup Does milky beauty have troubles with the letter V

తమన్నా బ్రేకప్ నేపథ్యంలో ఆమె పాత ఎఫైర్స్ ట్రెండింగ్‌లోకి వస్తున్నాయి. విజయ్ కంటే ముందు తమన్నాలు పలువురు సెలబ్రెటీలతో ప్రేమాయణం సాగించిందని బాలీవుడ్ మీడియా కోడై కూసింది. అప్పటి పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ అబ్ధుల్ రజాక్‌తో మిల్కీబ్యూటీ డేటింగ్ చేస్తుందంటూ గాసిప్స్ వచ్చాయి. ఓ ఈవెంట్‌లో వీరిద్దరూ క్లోజ్‌గా ఉండటం దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ కావడం ఆ వార్తలకు బలం చేకూర్చినట్లయ్యింది. అయితే తమన్నా ఈ కథనాలను ఖండించారు.

ఈ ఘటన తర్వాత టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో తమన్నా ప్రేమలో పడ్డారంటూ వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి ఓ వాణిజ్య ప్రకటనలో కలిసి నటించారు. అందులో విరాట్‌.. తమన్నాని చూడగానే ఫ్లాట్ అయిపోతాడు, ఎలాగైనా ఆమెతో మాట కలిపి పరిచయం పెంచుకోవాలని అనుకుని తన ఫోన్‌ని ఓ చోట పెట్టేస్తాడు. ఫోన్ వెతికే వంకతో తమన్నాతో మాట్లాడతాడు. నా ఫోన్ నెంబర్ కనిపించడం లేదు నా నెంబర్ చెబుతాను దానికి ఒకసారి కాల్ చేస్తారా అని చెబుతాడు. ఆమె ఫోన్ చేయగానే ఇదేనా మీ నెంబర్ .. నేను సేవ్ చేసుకోవచ్చా అంటూ అడుగుతాడు. ఈ యాడ్ సినీ, క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. దాంతో తమన్నా - విరాట్ కోహ్లీల మధ్య ప్రేమాయణం నిజమేనంటూ రకరకాల కథనాలు వైరల్ అయ్యాయి.

ఆ సమయంలో తమన్నా పెద్దగా ఈ వార్తలను పట్టించుకోలేదు.. కానీ తర్వాత ఖండించాల్సిన పరిస్ధితి నెలకొంది. ఓ యాడ్ షూటింగ్‌లో మాట్లాడుకున్నామని.. ఆ తర్వాత మేం ఎప్పుడు కలుసుకోలేదని , దానికే ఇష్టమొచ్చినట్లుగా అల్లేస్తారా అని తమన్నా ప్రశ్నించింది. అక్కడితో ఆగకుండా విరాట్ తాను చూసిన నటుల్లో గొప్ప నటుడంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది. విరాట్ కోహ్లీ - అనుష్క శర్మల వైవాహిక జీవితం బాగుండాలని ఆకాంక్షించింది. ఈ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. వీ లెటర్ ఉన్న అబ్బాయిలతో తమన్నా డేటింగ్ కలిసి రావడం లేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక తమన్నా భాటియా ప్రస్తుతం తెలుగులో ఓదెల 2లో చిత్రంలోనూ, హిందీలో మరో సినిమాలోనూ నటిస్తున్నారు. త్వరలోనే ఓదెల 2 ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X