Tamannaah- Vijay: విజయ్‌తో బ్రేకప్ తూచేనా? .. షాకిచ్చేలా తమన్నా పోస్ట్!

ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ సంచలనం సృష్టిస్తున్న అంశం ఏదైనా ఉందంటే అది మిల్కీ బ్యూటీ తమన్నా - విజయ్ వర్మల బ్రేకప్. రేపో మాపో పెళ్లి అనగా వీరిద్దరూ విడిపోవడం అభిమానులను సినీ ప్రముఖులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఏ కారణం చేత వీరిద్దరూ విడిపోయారు? ఎవరు ఈ మనస్పర్ధలకు కారణమయ్యారంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇద్దరూ తిరిగి ఒకొరినొకరు అర్ధం చేసుకుని కలిసిపోవాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమన్నా భాటియా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే.

లస్ట్ స్టోరీస్ 2 షూటింగ్ సమయంలో తమన్నా - విజయ్ ప్రేమలో పడ్డారు. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండటంతో మీడియా అప్పట్లోనే కోడై కూసింది. దీంతో సీక్రెట్‌గా తమ రిలేషన్ మెయింటైన్ చేసిన జంట దానిని ఎక్కువ రోజులు దాచలేకపోయింది. ఓ రోజున తమన్నానే స్వయంగా విజయ్‌తో తాను ప్రేమలో పడినట్లు క్లారిటీ ఇచ్చింది. విజయ్ కూడా తమన్నా తన బెస్ట్ ఛాయిస్ అంటూ ఓపెన్ అయిపోయాడు. విషయం అఫీషియల్ కావడంతో ఈ జంట పబ్లిక్‌గానే పార్టీలు, ఫంక్షన్లు, ఈవెంట్లకు కలిసి తిరగడం మొదలుపెట్టింది.

Tamannaah Bhatia wearing vijay varmas coat amid breakup rumours

తమన్నా ఎక్కడుంటే విజయ్ అక్కడ అన్నట్లుగా రాను రాను పరిస్ధితి తయారైంది. ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ రిలేషన్‌లో ఉన్న జంటలన్నీ ఒక్కొక్కటిగా పెళ్లి పీటలెక్కుతూ ఉండటంతో తమన్నా - విజయ్‌లు కూడా పెళ్లి పీటలెక్కుతారని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 40కి చేరువ అవుతుండటంతో తమ అభిమాన నటి త్వరగా ఓ ఇంటికి ఇల్లాలిగా మారిపోవాలని తమన్నా అభిమానులు కూడా బలంగా కోరుకున్నారు. అయితే పరిస్ధితులు మన చేతుల్లో లేవు అన్నట్లు విధి మరోలా స్కెచ్ వేసింది.

తమన్నా - విజయ్‌లు జంటగా కాకుండా విడివిడిగా కనిపించడంతో వీరి బ్రేకప్‌పై రూమర్స్ మొదలయ్యాయి. ఇద్దరూ పెట్టే స్టేటస్‌లు, ఇన్‌స్టా స్టోరీలు ఎక్కడో తేడా కొడుతుండటంతో మీడియా కూడా కన్ఫర్మ్ చేసుకుంది. తమన్నా కూడా రిలేషన్, ప్రేమ, పెళ్లి అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేయడం.. ప్రతి కార్యక్రమానికి ఇద్దరు విడివిడిగా హాజరు కావడంతో బ్రేకప్ అధికారికంగా జరిగినట్లేనని బాలీవుడ్ కూడా ఫిక్స్ అయ్యింది. అయితే కొన్ని సంఘటనలు మాత్రం అసలు తమన్నా - విజయ్‌ విడిపోయారా లేదా అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

హోలీ సందర్భంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ తన నివాసంలో నిర్వహించిన వేడుకలకు తమన్నా, విజయ్‌లు హాజరయ్యాయి. అయితే అది జంటగా కాకుండా విడివిడిగానే . తాజాగా తమన్నా పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమన్నా బెస్ట్ ఫ్రెండ్ అయిన నటి రాషా తడాని పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తమన్నా బ్లాక్ అండ్ వైట్ వెర్టికల్ లైన్స్‌తో ఓ కోటును ధరించింది.

ఇదే ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ కోట్ విజయ్‌దని అంతా చర్చించుకుంటున్నారు. గతంలో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నప్పుడు ఈ కోట్‌తో ఇద్దరూ దిగిన ఫోటోలు వైరల్ చేస్తున్నారు. తమన్నా నిజంగానే విజయ్‌తో విడిపోయిందా? లేక ఇద్దరూ కలిసే ఉన్నారా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. దీనిపై ఎవరో ఒకరు స్పందిస్తేనే కానీ ఈ పుకార్లకు తెరపడదు.

Take a Poll

More from Filmibeat

Read more about: tamannaah bhatia vijay varma
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X