Tamannaah Bhatia: విజయ్ వర్మతో తమన్నా బ్రేకప్! మిల్క్ బ్యూటీ పోస్ట్ పోస్ట్ వైరల్..
Tamannaah Bhatia:సినీ ఇండస్ట్రీలోని సెలబ్రెటీల లైఫ్ మనం అనుకున్నంత ఈజీగా ఉండదు. వారు ఎంత ఫేమస్ అయినప్పటికీ వారి ప్రైవేట్ స్పేస్ మాత్రం చాలా చిన్నది. దీంతో వారు ఏ చిన్న స్టెప్ తీసుకున్నా కూడా ఇట్టే వైరలవుతోంది. మరుక్షణంలో పుకార్లు షికార్లు చేస్తుంటాయి. అలా తాజాగా బాలీవుడ్ బ్యూటీ తమన్నా భాటియా తాజాగా వార్తల్లో నిలిచింది. తాను చేసిన ఓ చిన్న పోస్ట్ తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో విడిపోయారనే పుకార్లకు ఆజ్యం పోసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ?
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళ భాషాలలో పలువురు స్టార్ హీరోలతో నటించి, తనకంటూ ఓ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ గుర్తింపుతోనే బాలీవుడ్ అడుగుపెట్టింది. హిందీలో కూడా తన హవా కొనసాగిస్తుంది ఈ మిల్కీ బ్యూటీ. ఇదెలా ఉంటే.. బాలీవుడ్ నటి తమన్నా భాటియా, నటుడు విజయ్ వర్మ లు గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వారిద్దరూ అనేక సందర్భాలలో..పలు ఈవెంట్స్ , పార్టీలలో జంటగా కనిపించారు. అలాగే.. సోషల్ మీడియాలో కూడా ఫోటోలు, వీడియోలతో రచ్చ చేస్తుంటారు. అలా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన జంట తరువాత పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనీ, తమ ప్రేమ బంధాన్ని వివాహా బంధంగా మార్చుకోవాలని భావిస్తున్నారంటూ పలు వార్తలు వచ్చాయి.

అలాంటిది తాజాగా తమన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక స్టోరీ చూస్తుంటే విజయ్ వర్మతో బ్రేకప్‌పై హింట్ ఇస్తుందా? అనే అనుమానాలు వస్తున్నాయి. తమన్నా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. అందులో " 'ప్రేమించబడడానికి రహస్యం ప్రేమించడమే అని నేను అనుకుంటున్నాను. సరదాగా ఉండటానికి రహస్యం ఆసక్తికరంగా ఉండటమే. వేరే వాళ్లు మిమ్మల్ని అందంగా చూడాలంటే ముందు మీరు వేరే వాళ్లను అలా ఉండాలి. ఒకరి స్నేహం కావాలంటే ముందు మనం వారితో ఫ్రెండ్‌గా ఉండాలి' అంటూ ఓ ఇంట్రెస్టింగ్ కొటేషన్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది తమన్నా.
ఈ పోస్టు ను చూస్తుంటే ఇన్‌డైరెక్ట్ ఎవరికో కౌంటర్ వేస్తున్నట్టుగా ఉందని తన ఫాలోవర్స్ భావిస్తున్నారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో విజయ్ వర్మతో తమన్నా విడిపోయిందా? అంటూ రూమార్స్ వైరలవుతున్నాయి. అయితే, తమన్నా, విజయ్ లు తమ సంబంధం గురించి ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. వారు సోషల్ మీడియాలో ఒకరితో ఒకరు కనెక్ట్ అయి ఉంటారు. మరోవైపు.. విజయ్, తమన్నాలకు ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమకు బ్రేకప్ అవ్వడం అనేది అంత ఈజీ కాదని మరికొందరూ కామెంట్స్ చేస్తున్నారు.
విజయ్, తమన్నా భాటియా లు లస్ట్ స్టోరీస్ 2 అనే వెబ్ ఫిల్మ్‌లో కలిసి నటించారు. అప్పటి నుండి వారిద్దరూ లవ్ లో పడ్డారనీ, వారిద్దరూ రిలేషన్‌షిప్ ఉన్నారంటూ రూమర్స్ వస్తున్నాయి. అప్‌కమింగ్ యాక్టర్ విజయ్ వర్మతో ప్రేమలో పడి అందరినీ ఆశ్చర్యపరిచింది. వీరిద్దరూ కలిసి 'లస్ట్ స్టోరీస్ 2' అనే వెబ్ ఫిల్మ్‌లో నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. 2023 జూన్‌లో తమన్నా తన ప్రేమ విషయాన్ని ఓపెన్‌గా అనౌన్స్ చేసేసింది. అప్పటినుండి అంతా సాఫీగా సాగిపోతుంది. కానీ, తాజాగా తమన్నా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ మాత్రం ఏదో అనుమానం వ్యక్తం అయ్యేలా చేస్తుంది.

ఇదిలాఉంటే.. తమన్నా భాటియా ఇటీవల తన 'స్త్రీ 2' సినిమాలో 'ఆజ్ కీ రాత్ ' అంటూ బాలీవుడ్ ప్రేక్షకులకు చెమటలు పట్టించింది. ఆ పాటకు ఎనలేని పాపులర్టీ సొంతం చేసుకుంది మిల్కీ బ్యూటీ.


Click it and Unblock the Notifications











