ఐకానిక్ ఐటెమ్ సాంగ్‌‌‌‌ రీమిక్స్‌‌‌‌లో తమన్నా.. ఆ లెజెండరీ హీరోయిన్‌ను మ్యాచ్ చేయగలదా?

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండేది. అప్పటిలో స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. ఈమె ఈ మధ్య బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉంది. అటు తమిళ్ సినిమాల్లో కూడా నటిస్తూ వస్తుంది. హిందీలో పలుచిత్రాల్లో మెరిసిన తమన్నా ఇక ప్రస్తుతం అక్కడే వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. మరో పక్క స్పెషల్ సాంగ్స్ తో అలరిస్తుంది. ఇదిలా ఉంటే..బాలీవుడ్‌లో ఒకప్పుడు సంచలనం సృష్టిస్తున్న ఓ ఐటెం సాంగ్ రీమేక్ లో నటించబోతుందట. ఇంతకీ ఆ సాంగ్ ఏంటీ? ఆ సినిమా ఏంటీ?

బాలీవుడ్‌లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన సినిమా ఖల్ నాయక్ ( Khalnayak). 1993లో విడుదలైన ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న 'ఖల్ నాయక్ రిటర్న్స్' ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు సంచలన విజయం సాధించిన ఈ మళ్లీ తెరపైకి తీసుకురావడం మాత్రమే కాదు, అందులో ఐకానిక్ వస్తువులను కూడా రీ క్రియేట్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసిన సమాచారం. ముఖ్యంగా అప్పట్లో ఐకానిక్ సాంగ్ అయిన "చోలీ కేఛే క్యా హై" ను మళ్లీ రీమిక్స్ చేయబోతున్నారన్న వార్తల ఆసక్తి మరింతగా పెరుగుతోంది. అయితే.. ఈ సాంగ్‌లో తమన్నా భాటియా కనిపించబోతుందనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tamannaah in Choli Ke Peeche Remix Can She Match Madhuri Dixit s Iconic Magic

ఒరిజినల్ వెర్షన్‌లో మాధురీ దీక్షిత్ చూపించిన ఎక్స్‌ప్రెషన్స్, డాన్స్ గ్రేస్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ కలిసి ఈ పాటను లెజెండరీ స్థాయికి తీసుకెళ్లాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ అందించిన స్టెప్పులు, లక్ష్మీకాంత్-ప్యారేలాల్ సంగీతం, ఆనంద్ బక్షి సాహిత్యం ఈ పాటను ఆల్-టైమ్ క్లాసిక్‌గా నిలబెట్టాయి. అయితే ఈ పాటకు ఉన్న ప్రత్యేకతతో పాటు వివాదం కూడా తక్కువేమీ కావు. డబుల్ మీనింగ్ లతో కూడిన లిరిక్స్ అప్పట్లో పెద్ద చర్చకు దారి తీశాయి. అయినప్పటికీ.. ఈ పాట కాల్ట్ ఫాలోయింగ్ సంపాదించింది. నేటికీ పార్టీల్లో, స్టేజ్ షోలలో ఈ సాంగ్ వినబడుతూనే ఉంటుంది.

ఇక 2024లో వచ్చిన 'క్రూ' అనే సినిమాలో కూడా ఈ ట్రాక్‌కు రీమిక్స్ వెర్షన్ ఇవ్వడం, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం... ఈ పాట క్రేజ్ ఇంకా తగ్గలేదని నిరూపించింది. ఇలాంటి లెజెండరీ సాంగ్‌ను మళ్లీ రీ క్రియేట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇక్కడే తమన్నా ఎంపికపై చర్చ మొదలైంది. ఇప్పటికే పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌తో తన డాన్స్ స్కిల్స్‌ను ప్రూవ్ చేసిన తమన్నా, గ్లామర్‌తో పాటు ఎనర్జీతో కూడిన ప్రెజెన్స్‌ను చూపగలదనే నమ్మకం మేకర్స్‌కు ఉందని టాక్. ముఖ్యంగా ఇటీవల ఆమె చేసిన డాన్స్ నంబర్స్‌కు రెస్పాన్స్ చూసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పటివరకు ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సాంగ్ రీమిక్స్ పై చర్చలు జరుగుతున్నప్పటికీ, ఫైనల్ కాస్టింగ్ ఇంకా లాక్ కాలేదని తెలుస్తోంది. అయినప్పటికీ, తమన్నా పేరు బలంగా వినిపించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు, సంజయ్ దత్ తన ఐకానిక్ పాత్రలో తిరిగి కనిపించనున్న నేపథ్యంలో 'ఖల్ నాయక్ రిటర్న్స్'పై అంచనాలు మరింత పెరిగాయి.

ఈ సీక్వెల్ కేవలం నోస్టాల్జియా మీద ఆధారపడకుండా, కొత్త తరానికి తగ్గట్టుగా మోడ్రన్ టచ్‌తో రూపొందించే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారు. అందులో భాగంగానే ఈ సాంగ్‌కు రీమిక్స్ ఐడియా వచ్చిందట. అధికారిక ప్రకటన వచ్చే వరకు... ఇది ఒక హైప్ క్రియేట్ చేసిన రూమర్‌గా మాత్రమే మిగిలిపోతుంది. ఒక వేళ ఆ రిమేక్ సాంగ్ లో తమన్నా స్టెప్పులేసి మాధురి మ్యాజిక్‌ను మ్యాచ్ చేయగలదా? అనేది కామెంట్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X