Tamannaah: ఆ బిజినెస్ మ్యాన్ తో తమన్నా పెళ్లి.. త్వరలో అధికారిక ప్రకటన

మిల్కీ బ్యూటి తమన్నా హ్యాపీ డేస్ సినిమాతో యూత్ హృదయాలను కొల్లగొట్టింది. ఇండస్ట్రీకి వచ్చిన 17 ఏళ్లలో సుమారు 50కిపైగా చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ సినిమాల్లో కూడా అలరించి తన సత్తా చాటుకుంది. ఇటీవల వెంకటేష్ సరసన F3 సినిమాలో నటించి ఫన్ అందించింది. అలాగే నేరుగా ఓటీటీలో విడుదలైన బబ్లీ బౌన్సర్ సినిమాతో ఇటు తెలుగు అటు హిందీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఇటీవల తమన్నా పెళ్లిపై అనేకంగా పుకార్లు వస్తున్నాయి. మొన్న సినీ ఇండస్ట్రీకి చెందిన అబ్బాయితో తమన్నా పెళ్లి జరగనుందని రూమర్ రాగా ఇప్పుడు తాజాగా మరో వార్త షికారు చేస్తోంది.

ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు..

ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు..

ఇప్పుడున్న గ్లామరస్ బ్యూటీలలో ఎక్కువ కాలం నిలదొక్కుకున్న అతి కొద్ది మంది స్టార్ హీరోయిన్స్ లలో తమన్నా భాటియా ఒకరు. ఈ బ్యూటీ సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి 17 ఏళ్లు గడుస్తోంది. తన స్టార్ ఇమేజ్ తోనే ఇప్పటికీ మంచి అవకాశాలు అందుకుంటుంది. 2005లో శ్రీ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తమన్నా ఆ తర్వాత భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీలో మంచి అవకాశాలను అందుకుంది.

సినిమాల స్థాయిని పెంచుకుంటూ..

సినిమాల స్థాయిని పెంచుకుంటూ..

మిల్కీ బ్యూటి తమన్నా మొదట్లో మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలలో సెలెక్ట్ చేసుకుని తన స్టార్ హోదాను పెంచుకుంది. ఇక తర్వాత మెల్లిగా మీడియం బడ్జెట్ సినిమాలు ఆ తరువాత బిగ్ బడ్జెట్ సినిమాలలో అవకాశాలు అందుకుంటూ వచ్చింది. తమన్నా తన సినిమా ప్రయాణంలో సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండానే కొనసాగింది. ఒక సినిమా డిజాస్టర్ అయితే ఆ తర్వాతి వెంటనే మరొక సినిమాతో ఫామ్ లోకి వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంది ఈ బ్యూటి.

కామెడీ డ్రామాగా బబ్లీ బౌన్సర్..

కామెడీ డ్రామాగా బబ్లీ బౌన్సర్..

హ్యాపీ డేస్, 100% లవ్, రచ్చ, బాహుబలి, F 2 సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. మరొకవైపు స్పెషల్ సాంగ్ తో కూడా గుర్తింపు అందుకుంది. ఇక తమన్నా భాటియా నటించిన కొత్త చిత్రం బబ్లి బౌన్సర్ సెప్టెంబర్ 25వ నేరుగా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదలైంది. కామెడీ డ్రామాగా తెరకెక్కిన తమన్నా బబ్లీ బౌన్సర్ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

 పెళ్లి ఫిక్స్ అయిందని వార్తలు..

పెళ్లి ఫిక్స్ అయిందని వార్తలు..

మధుర్ బండార్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బబ్లీ బౌన్సర్ సినిమాలో తమన్నా ఒక లేడీ బౌన్సర్ గా కనిపించి ఆకట్టుకుంది. సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న తమన్నాకు ఇటీవల కాలంలో రూమర్స్ బెడద అంటుకుంది. ఇటీవలనే బబ్లీ బౌన్సర్ సినిమా ప్రమోషన్స్ సమయంలో తమన్నాకు పెళ్లి ఫిక్స్ అయిందని వార్తలు వచ్చాయి. సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ అబ్బాయిని తమన్నా వివాహమాడనుందని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి.

సినిమాల జోరు తగ్గించిందా..

సినిమాల జోరు తగ్గించిందా..

అయితే ఆ పెళ్లి వార్తలపై బహిరంగంగా స్పందించింది తమన్నా భాటియా. అలాంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి తమన్నాను పెళ్లి వార్తలు చుట్టుముట్టాయి. తమన్నా త్వరలో ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో వివాహ బంధానికి సిద్ధమైందని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే సినిమాల జోరు కాస్తా తగ్గించిందని బాలీవుడ్ సినీ వర్గాలు అంటున్నాయట.

త్వరలోనే అధికారిక ప్రకటన..

త్వరలోనే అధికారిక ప్రకటన..

ముంబైకి చెందిన ఓ యంగ్ బిజినెస్ మ్యాన్ తో మిల్కీ బ్యూటి తమన్నా ఓకే చెప్పేసిందని.. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందన్న వార్తలు తెగ షికారు చేస్తున్నాయి. ఇలా మరోసారి తమన్నా పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనేది ఆమె స్పందిస్తేగానీ చెప్పలేం. కాగా మెగాస్టార్ చిరంజీవి-మెహర్ రమేశ్ కాంబినేషన్ లో వస్తున్న భోళా శంకర్ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X