తమన్నా ఆప్షన్ పెద్ద హీరోలేనా? అందుకే నో అంటోందా..?
సౌత్ ఇండియన్ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా. కెరీర్ ఆరంభంలో అందరు హీరోలతో నటించినప్పటికీ.. క్రమంగా పెద్ద హీరోలందరితో రొమాన్స్ చేసింది తమన్నా. అందం, నటనతో దక్షిణ భారతదేశ ఆడియన్స్ ని ఆకట్టుకుంది.
వరుస సినిమాలు చేస్తూ వస్తున్న తమన్నా తాజాగా ఓ మీడియం రేంజ్ హీరో సినిమా సింపుల్ గా రిజెక్ట్ చేసిందని తెలుస్తోంది.
ప్రభాస్ తో కలిసి బాహుబలి లాంటి పెద్ద సినిమాలో నటించిన తమన్నా.. ఆ తరువాత 'అభినేత్రి' సినిమాతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో తమన్నాకు అవకాశాలు తగ్గినప్పటికీ ఐటం సాంగ్స్ విషయంలో మాత్రం ఇరగతీస్తోంది. కాగా తాజాగా ఆమెకు గోపీచంద్ సరసన ఓ సినిమాలో నటించేందుకు అవకాశం వచ్చిందట. కానీ ఈ ఆఫర్‌ని డేట్లు ఖాళీ లేవంటూ సున్నితంగా రిజక్ట్ చేసిందట ఈ మిల్కీ బ్యూటీ.

ప్రస్తుతం తమన్నా ఎక్కువగా సీనియర్ హీరోల సరసన నటిస్తూ మంచి రెమ్మ్యూనరేషన్ తీసుకుంటోంది. ఇటీవలే ఎఫ్ 2 సినిమాలో వెంకటేష్ సరసన ఆడిపాడిన ఈ భామ ప్రస్తుతం చిరంజీవి సరసన సైరా నరసింహా రెడ్డి సినిమాలో నటిస్తోంది. దీంతో.. తమన్నా పెద్ద హీరోలనే ఆప్షన్ గా ఎంచుకుందేమో! అందుకే గోపీచంద్ లాంటి మీడియం రేంజ్ హీరో సరసన నటించేందుకు నో అంటోంది అనే టాక్ వినిపిస్తోంది ఫిలిం నగర్ సర్కిల్స్‌లో.


Click it and Unblock the Notifications











