తమన్నా కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్ ఇలా! నిమిషం కూడా ఆలోచించకుండా డిసీజన్..
మిల్కీబ్యూటీ తమన్నా వరుస సినిమాలతో బిజీ అవుతోంది. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరు హీరోలతో జతకడుతూ ముందుకు సాగుతోంది. ఇటీవలే వెంకటేష్ సరసన 'ఎఫ్ 2' సినిమాలో ఆడిపాడిన ఈమె.. మరికొద్ది రోజుల్లోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహా రెడ్డి' సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది.
ఇదిలా ఉంటే ఇటీవలే గోపీచంద్ హీరోగా తెరకెక్కనున్న కొత్త సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా వివరాలు అఫీషియల్‌గా ప్రకటించేశారు కూడా. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాకు నిర్మాతగా ఉవహరించనున్నారు.

కాగా తాజాగా ఈ సినిమా తమన్నా పోషించనున్న రోల్ విషయమై ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. ఇందులో మహిళల కబడ్డీ కోచ్‌గా తమన్నా కనపడతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పాత్ర గురించి డైరెక్టర్ వివరించగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఓకే చేసిందట తమన్నా. ఇదే జరిగితే స్పోర్ట్స్ నేపథ్యంలో తమన్నా నటించిన తొలి సినిమా ఇదే అవుతుంది. 14 ఏళ్ల క్రిందట కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు ఎన్నో గ్లామర్ రోల్స్, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసినప్పటికీ ఇలాంటి పాత్ర పోషించలేదు.
గతంలో ఇదే సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ, బెంగాల్ టైగర్ సినిమాలు చేసింది తమన్నా. ఈ రెండు సినిమాల్లోనూ తమన్నా మెరుపు లాంటి అందాలు వెండితెరపై హంగామా చేశాయి. సో ఈ సినిమాలో కూడా ఆమె అందాలు స్పెషల్ ట్రీట్ ఇవ్వడం ఖాయం అని ఫిక్స్ అయ్యారు ప్రేక్షకులు. చూడాలి మరి కబడ్డీ కోచ్ గా తమ్మూ ఎలాంటి విందు ఇస్తుందో!.


Click it and Unblock the Notifications











