మహేష్ బాబుతో తమన్నా! ఇక మనోడు ఆగడు.. సూపర్ స్టార్ అభిమానులకు పండగే..

సూపర్ స్టార్ మహేష్ బాబు, తమన్నా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని తెలుస్తోంది. అది కూడా ఐటెం సాంగ్‌లో. ఈ మేరకు ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఇందుకు సంబంధించిన చర్చలు ముదిరాయి. ఇంకేముంది ఈ వార్త తెలిసి మహేష్ అభిమానులు ఇప్పుడే పండగ చేసుకుంటున్నారు. తమన్నా అందాల విందులో మహేష్ చిందులు చూడాలని కుతూహల పడుతున్నారు. ఇంతకీ మహేష్ బాబుతో ఏ సినిమాలో తమన్నా ఐటెం సాంగ్ చేస్తోంది? ఆ వివరాలేంటి? చూద్దామా..

మహర్షి జోష్‌లో సరిలేరు నీకెవ్వరు

మహర్షి జోష్‌లో సరిలేరు నీకెవ్వరు

ఇటీవలే మహేష్ బాబు 25వ సినిమా 'మహర్షి' సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన జోష్‌లోనే మహేష్ బాబు తన 26వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో మొదలు పెట్టేశారు. దీనికి 'సరిలేరు నీకెవ్వరు' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది.

ఐటెం సాంగ్.. అదీ అత్యంత ప్రత్యేకం

ఐటెం సాంగ్.. అదీ అత్యంత ప్రత్యేకం

'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో ప్రేక్షక లోకానికి పూనకం తెప్పించేలా ఓ ఐటెం సాంగ్ ప్లాన్ చేశారట దర్శకనిర్మాతలు. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉండేలా ఈ సాంగ్‌ని అత్యంత ప్రత్యేకంగా తెరకెక్కించనున్నారని సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో భాగం గానే మరికొద్ది రోజుల్లోనే ఈ ఐటెం సాంగ్ చిత్రీకరణ ప్రారంభించాలని భావిస్తున్నారట మేకర్స్.

తమన్నా సొగసు.. భారీ పారితోషికం

తమన్నా సొగసు.. భారీ పారితోషికం

ఈ ఐటెం సాంగ్ యమ ఫాస్ట్ బీట్‌తో కూడి క్లాస్, మాస్ ఆడియన్స్‌ చేత కేకలు పెట్టించేలా ఉండాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. పైగా ఈ సాంగ్‌లో మహేష్ బాబుతో తమన్నాను చిందులేపించాలని, తమన్నా సొగసు పాటకు స్పెషల్ డోస్ ఇచ్చేలా ఉండాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం తమన్నాకు భారీ పారితోషికం కూడా ఆఫర్ చేసినట్లు సమాచారం.

సోనాక్షి సిన్హా, శృతి హాసన్, పూజా హెగ్డే

సోనాక్షి సిన్హా, శృతి హాసన్, పూజా హెగ్డే

'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో ఈ ఐటెం సాంగ్ కోసం ముందుగా సోనాక్షి సిన్హా, శృతి హాసన్, పూజా హెగ్డే లాంటి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ చివరకు తమన్నా అయితే బెటర్ అని, ఆమెనే ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. పైగా గతంలో చాలా సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసి మెప్పించిన అనుభవం తమన్నా సొంతం కాబట్టి ఈ నిర్ణయానికి వచ్చారట మేకర్స్.

మహేష్ బాబు 'ఆగడు'

మహేష్ బాబు 'ఆగడు'

ఇక తమన్నా, మహేష్ బాబు జోడీ గురించి చెప్పుకుంటే.. గతంలో శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆగడు' సినిమాలో మహేష్‌తో స్టెప్పులేసి వావ్ అనిపించుకుంది తమన్నా. ఈ ఇద్దరి సిల్వర్ స్క్రీన్ రొమాన్స్ మహేష్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. దీంతో 'సరిలేరు నీకెవ్వరు'లో ఐటెం సాంగ్ రూపంలో మరోసారి ఈ జోడీ హంగామా చూడాలని కుతూహలంగా ఉన్నారు మహేష్ ఫ్యాన్స్.

సరిలేరు నీకెవ్వరు మూవీ

సరిలేరు నీకెవ్వరు మూవీ

అనిల్ రావిపూడి దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాగా రూపొందుతోంది 'సరిలేరు నీకెవ్వరు' మూవీ. చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ విజయశాంతి ముఖ్యపాత్ర పోషిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X