Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మాస్ మహారాజ్‌తో తమన్నా రొమాన్స్.. మళ్ళీ రిపీట్!
జయాపజయాల సంగతి అటుంచితే మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్' సినిమా చేస్తున్న ఆయన ఈ సినిమా తరువాత 'రాక్షసుడు' దర్శకుడు రమేశ్ వర్మతో కలిసి రవితేజ సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఆ వెంటనే నక్కిన త్రినాథరావుతో మరో ప్రాజెక్టులో భాగం కానున్నారు.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ కోసం వేట ప్రారంభించిన చిత్రయూనిట్.. తమన్నాను తీసుకోవాలని ఫిక్సయిందట. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రవితేజతో నటించేందుకు తమన్నా సుముఖంగా ఉన్నట్లు టాక్. గతంలో ఈ జోడీ 'బెంగాల్ టైగర్' సినిమాలో నటించింది. సో.. మళ్ళీ అదే జోడీ, అదే జోష్ రిపీట్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. ఈ సినిమాలో రవితేజ లుక్ డిఫరెంట్‌గా ఉంటుందని, తమన్నా పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని అంటున్నారు. అతిత్వరలో ఈ సినిమాకు సంబంధించి పూర్తివివరాలు ప్రకటించనున్నారు.
ఇటీవలే F2 మూవీలో వరుణ్ తేజ్ సరసన స్టెప్పులేసి మిల్కీ బ్యూటీ.. ఈ ఏడాది సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు' పార్టీ సాంగ్ తో శుభారంభం ఇచ్చింది. ఈ పాటతో తమన్నా వేసిన స్టెప్స్ ప్రేక్షకలోకాన్ని ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ఈ సాంగ్ సినిమాకే మేజర్ అసెట్‌గా నిలిచింది.