»   »  'ఆగడు': స్వీట్స్ అమ్ముతూ తమన్నా

'ఆగడు': స్వీట్స్ అమ్ముతూ తమన్నా

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    హైదరాబాద్ : మహేష్‌బాబు - శ్రీనువైట్ల కలయిక మరోసారి 'ఆగడు' సినిమాతో పునరావృతం కాబోతున్న సంగతి తెలిసిందే. 'దూకుడు' తరవాత వీరిద్దరి నుంచి వస్తున్న చిత్రమిది. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా చాలా మందిని అనుకుని తమన్నాని ఖరారు చేశారు. ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ చిత్రం సెట్స్ పై ఆమె స్వీట్స్ అమ్ముతూ కనిపించింది. ఆమె ఈ చిత్రంలో పోలీస్ పాత్రను పోషిస్తోందని వినికిడి. మరి ఈ స్వీట్స్ అమ్మటానికి,పోలీస్ పాత్రకు సంభంధం ఏమిటనేది తెరపైన చూడాల్సిందే.

    అంతేకాదు మహేష్‌తో జత కట్టడం తమన్నాకి ఇదే తొలిసారి. దాంతో ఆమె ఎగిరి గంతేసి ఒప్పుకుందని,కంటిన్యూ డేట్స్ కేటాయించటానికి ముందుకువచ్చిందని సమాచారం. తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు. వినోదం, యాక్షన్‌ కలగలిపిన చిత్రమిది. స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల పూర్తి నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రంలో మహేష్ ...టఫ్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు.

    Tamannah

    గతంలో పోకిరి,దూకుడు చిత్రాలలో పోలీస్ గా కనిపించిన మహేష్ బాబు మరోసారి పోలీస్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ఆగడు లో మహేష్ మరోసారి పోలీస్ గా తన విశ్వరూపం చూపించనున్నాడని సమాచారం. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఈ సారి మరింత యాక్షన్ ని పెంచినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ తో చేసిన బాద్షా చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకోవటంతో ఈ సారి మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని శ్రీను వైట్ల ఫిక్సైనట్లు చెప్తున్నారు. అందుకు తగినట్లే మహేష్ క్యారెక్టర్ ని టఫ్ పోలీస్ గా రూపొందించినట్లు చెప్పుకుంటున్నారు.

    ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల పూర్తి నమ్మకంగా ఉన్నారు. ఇంతకాలం శ్రీను వైట్లతో కలిసి పని చేసిన గోపీ మోహన్, కోన వెంకట్ సొంతగా దర్శకత్వం వైపు అడుగులు వేయడంతో.... 'ఆగడు' సినిమాకు సొంతగా స్క్రిప్టు రాసుకుని దిగారు శ్రీను వైట్ల. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో 'దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు చేసారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో 'ఆగడు' సినిమా చేయడానికి రెడీ కావడం గమనార్హం. సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: కె.వి. గుహన్‌, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌, కూర్పు: ఎం.ఆర్‌.వర్మ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి.

    English summary
    Tamannah will be seen in an interesting role in the upcoming Mahesh Babu starrer ‘Aagadu’. The film was shot today in Ramoji Film City and Tamannah is playing the role of a sweet seller on the set. Mahesh Babu looked handsome as a rough and tough cop.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more