తెలంగాణ రాణి గా తమన్నా ఖరారు?

By Srikanya

Tamanna
వరస విజయాలతో పెద్ద హీరోల సరసన సినిమాలు పట్టుకుంటూ దూసుకుపోతున్న హీరోయిన్ తమన్నా. ఆమె తాజాగా తెలంగాణా ప్రాంత వరంగల్ ని ఏలిన రాణి 'రుద్రమదేవి' పాత్రను కమిటైనట్లు సమాచారం. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ రీసెంట్ గా ఆమెను కలిసి కథ వినిపించి ఓకే చేయించుకున్నట్లు చెప్తున్నారు. అయితే డేట్స్ ఖాళీ లేవని చాలా కాలం పడుతుందని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ చిత్రం చేయటానికి గుణశేఖర్ కంటిన్యూగా డేట్స్ అడిగాడని వినికిడి.

ఈ ప్రాజెక్టు గురించి గుణశేఖర్ మీడియోతో మాట్లాడుతూ...''ఒక్కడు' తరవాత మొదలైన ఆలోచన 'రుద్రమదేవి'. అప్పటి నుంచీ ఈ కథపై కసరత్తు చేస్తూనే ఉన్నాను. ఇలాంటి కథను టెక్నికల్ గా అత్యున్నత విలువలతో నిర్మించాలి. అందుకే ఇంతకాలం వేచి చూశాను. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. ఈ కల త్వరలోనే కార్యరూపం దాల్చబోతోంది'' అని చెప్పారు. ఇంతకీ హీరోయిన్ ఓకే అయినప్పుడే కదా ప్రాజెక్టు పట్టాలెక్కేది అంటున్నారు.

ఇక నయనతార,అనూష్క ఇద్దరూ కూడా 'రుద్రమదేవి'హీరోయిన్ రేసులో ఉన్నారు. జేజమ్మగా అరుంధతిలో అదరకొట్టిన అనూష్క అయితే బావుంటుందని కొందరు కాదు..సీతమ్మ తల్లిగా శ్రీరామ రాజ్యంలో నిలిచిపోయిన నయనతార అయితే బెస్ట్ అని మరికొందరు అంచనాలు వేస్తున్నారు. అయితే గుణశేఖర్ ఇద్దరికీ స్క్ర్రిప్టు చెప్పాడని,అయితే ఇద్దరిలో ఎవరూ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. గుణశే్ఖర్ వరస ప్లాపుల్లో ఉండటంతో ఏ హీరోయిన్ కూడా ఆయన సినిమాలో చేయటానికి పెద్దగా ఆసక్తి చూపటం లేదు. అందులోనూ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అంటే హీరోల సినిమాలకు దూరమవ్వటమే అని భావిస్తున్నారు.

అలాగే గుణశేఖర్ 'రుద్రమదేవి' పాత్ర కోసం ఇద్దరు సౌత్ లో ఇద్దరు పెద్ద హీరోయిన్స్ ని సంప్రదించారని చెప్పారు. ఆ హీరోయిన్స్ అనుష్క, నయనతార అని తెలిసింది. అలాగే వీరిద్దరి తో పాటు ప్రియాంక చోప్రాల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే నయనతారే ఖాయిం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక నిప్పు చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. రవితేజ హీరోగా వైవియస్ చౌదరి నిర్మించిన ఈ చిత్రం మార్నింగ్ షో కే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X