Tamannah Marriage: ప్రియుడితో పెళ్లికి సిద్ధమైన తమన్నా భాటియా.. ముహూర్తం ఎప్పుడంటే?

మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్న ఈ స్టార్ హీరోయిన్... నటిగానే కాకుండా మోడల్ గా, డ్యాన్సర్ గా కూడా ప్రత్యేక గుర్తింపు పొందింది. ముఖ్యంగా 2005లో చాంద్ సా రోషన్ చెహ్రా సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన తమన్నా.. ఇప్పటికీ టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తన ప్రియుడితో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది.

బాలీవుడ్ స్టార్ హీరో విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో పడినట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. రెగ్యులర్ గా వీరిద్దరూ కలిసి పార్టీలకు హాజరు కావడంతో వీరిద్దరి మధ్య లవ్ ఉందని అంతా అనుకున్నారు. ముఖ్యంగా గతంలో వాలైంటైన్స్ డే సందర్భంగా విజయ్ వర్మ ఒక చేయిని పోస్ట్ చేసి తన ప్రేమ గురించి చెప్పారు. తాను ప్రేమలో ఉన్నట్లు చెప్పాడే తప్ప అది తమన్నా అని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. కానీ అంతా ఆ చేయి తమన్నాదే అనుకొని ఫిక్స్ అయ్యారు. అంతేనా పెద్ద ఎత్తున వారి ప్రేమ గురించి న్యూస్ ను స్ప్రెడ్ చేశారు.

 Tamannah Bhatia And Vijay Varma Going to Marry on Next Year Check Details

అయితే వీటిపై ఇటు తమన్నా కానీ అటు విజయ్ వర్మ కానీ స్పందించలేదు. అలా అని ఈ వార్తలను ఖండించనూ లేదు. దాని వల్ల కూడా అంతా వీరిద్దరూ ప్రేమికులు అని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అనుకున్నారు. కానీ ఎంత కాలం అయినా వీటి గురించి ఎవరూ స్పందించకపోవడంతో అంతా గమ్మునుండిపోయారు. కానీ మరోసారి వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ముఖ్యంగా తమన్నా తల్లిదండ్రులు ఆమె పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారట. ప్రస్తుతం తమన్నాకు 33 ఏళ్ల వయసు.

 Tamannah Bhatia And Vijay Varma Going to Marry on Next Year Check Details

వయసు పెరుగుతుండడంతో త్వరగా ఆమె పెళ్లి చేసుకుంటే బాగుంటుందని భావించిన కుటుంబ సభ్యులు ఇదే విషయాన్ని నేరుగా ఆమెకు చెప్పారట. దీంతో తమన్నా కూడా పెళ్లికి ఓకే చెప్పిందట. ముందు నుంచి ఆమెతో పెళ్లికి విజయ్ సముఖంగానే ఉండగా.. ఆమెనే కొన్ని రోజులు ఆగుదామని చెప్పిందని కూడా వార్తలు వినిపించాయి. తాజాగా తల్లిదండ్రుల మాటలు విన్న ఈ ముద్దుగుమ్మ పెళ్లికి సిద్ధమైందట. అయితే విజయ్ వర్మ కుటుంబ సభ్యులతో మాట్లాడి పెళ్లిని ఫిక్స్ చేసుకుంటారట.

 Tamannah Bhatia And Vijay Varma Going to Marry on Next Year Check Details

ప్రస్తుతం తమన్నా భాటియా, విజయ్ వర్మల చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. అవి పూర్తి చేసుకున్న తర్వాత ఎలాంటి టెన్షన్ లేకుండా మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతారట. ఈ సినిమాలు ఈ ఏడాదితో పూర్తి అవుతాయని.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోవాలని తమన్నాతో పాటు ఆమె ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటున్నారట. విజయ్ వర్మ కుటుంబ సభ్యులు కూడా ఫిబ్రవరిలో వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. మరికొన్ని రోజుల్లోనే అఫీషియల్ గా వీరి పెళ్లిని విషయాన్ని చెబుతారు. చూడాలి మరి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X