twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సల్మాన్ సినిమాలో సౌత్ హీరో

    |

    బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వీలైనంత వరకు కలెక్షన్స్ ని స్పీడ్ గా రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల దబాంగ్ 3 సినిమాతో చుల్ బుల్ పాండే గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సల్మాన్ ఓపెనింగ్స్ అయితే గట్టిగానే అందుకున్నాడు గాని అనుకున్నంత స్థాయిలో పూర్వ వైభవాన్ని చూపించలేకపోయారు. అయితే ఈ సినిమాలో కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ విలన్ గా నటించిన విషయం తెలిసిందే.

    దాంతో ఈ సినిమాకు ఆదరణ పెరిగిందనే చెప్పాలి. తాజాగా సల్మాన్ తాను నటిస్తున్న రాధే సినిమాలో కూడా ఓ సౌత్ హీరోను కీలక పాత్రలో నటింపజేయాలని చూస్తున్నాడు. తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో భరత్ సల్మాన్ సినిమాలో నటించనున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది

    tamil actor Bharath in salman khan next movie

    ఆమె తో పాటు మేఘ ఆకాష్ కూడా ఈ సినిమా నటిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో సల్మాన్ సరికొత్తగా కనిపించబోతున్నాడట.ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ని చాలా వేగంగా ఫినిష్ చేయాలనీ సల్మాన్ ఫిక్స్ అయ్యాడు. ఇక ఈ సినిమాలో కామెడీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నారని తెలుస్తుంది. ఇందుకోసం గబ్బర్ సింగ్ సినిమాతో ఫెమస్ అయినా నర్రా శ్రీను అనే యాక్టర్ ను కూడా ఈ సినిమాలో తీసుకున్నారని తెలుస్తోంది. చూస్తుంటే సల్మాన్ సినిమా మొత్తం సౌత్ యాక్టర్స్ తోనే నిండిపోయేట్టు కనిపిస్తోంది.

    English summary
    Salman Khan has roped in many actors and technicians from the South Indian film industry for Radhe, As he wants to make it look like Pan India Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X