‘డిస్కోరాజా’ కోసం ఎవరూ ఊహించని ప్రత్యర్థిని సెట్ చేసుకున్న రవితేజ

మాస్ మహరాజ రవితేజ ప్రస్తుతం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' అనే సినిమా చేస్తున్నాడు. కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఎస్‌‌ఆర్‌‌టీ ఎంటర్‌టైన్మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభ నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్‌ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ఎస్‌ఎస్‌ తమన్‌ స్వరకర్త. ఈ సినిమాపై రవితేజ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో రవితేజ ప్రత్యర్థి ఎవరనే దానిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. అయితే, తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇందులో ప్రతినాయకుడిగా తమిళ స్టార్ బాబీ సింహాను తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈయన తమిళంతో పాటు తెలుగు, కన్నడ సహా పలు భాషల్లో నటించాడు. అక్కడ చేతి నిండా సినిమాలతో ప్రస్తుతం బిజీగా గడుపుతున్నాడు.

Tamil actor Fix For Ravi tejas Disco Raja

అయితే, చాలా రోజులుగా ఈయన డేట్స్ కోసం 'డిస్కోరాజా' యూనిట్ వేచి చూస్తోంది. తాజాగా ఆయన తన సినిమా షూటింగులు ముగించుకోవడంతో పాటు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో తమిళ హీరో మాధవన్‌ను తీసుకుంటారని ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ, అది జరగలేదు. ఇప్పుడు ఈయన పేరు తెరపైకి వచ్చింది. ఈయన త్వరలోనే షూటింగ్‌లో జాయిన్ అవుతాని కూడా తెలుస్తోంది.

గతంలో ఈ సినిమా టైటిల్‌ లోగోను కూడా విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే, తొలి షెడ్యూల్‌ పూర్తయిన తర్వాత చాలా రోజులు విరామం రావడంతో.. చిత్రం ఆగిపోయిందని ప్రచారం జరిగింది. దీంతో ఈ వార్తలపై చిత్ర నిర్మాతలు క్లారిటీ కూడా ఇచ్చారు. చిత్రం ఆగిపోయిందనే వార్తల్లో నిజం లేదని తేలింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X