ఎన్టీఆర్ ముస్లిం యువకుడు.. రాంచరణ్ బాబాయ్ ఎవరంటే!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంపై ఇప్పటి నుంచే ఆకాశాన్ని తాకే అంచనాలు నెలకొంటున్నాయి. రాజమౌళి ఈ భారీ చిత్రం గురించి ఎలాంటి విశేషాలు తెలియజేయకున్నా ఎన్టీఆర్, రాంచరణ్ పాత్రల గురించి, కథ గురించి సోషల్ మీడియాలో అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. నవంబర్ లో ఈ చిత్రాన్ని ప్రారంభించి అప్పుడే రాజమౌళి ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేశాడు. జనవరిలో సెకండ్ షెడ్యూల్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రగురించి ఉత్కంఠ రేకెత్తించే వార్తలు వినిపిస్తున్నాయి.

ముస్లిం యువకుడిగా
ఎన్టీఆర్ ఈ చిత్రంలో సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. ఎన్టీఆర్ ఫిజికల్ ట్రైనర్ స్టీవ్ లాయిడ్ కొత్త లుక్ పై దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ బందిపోటుగా కనిపించనున్నాడనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. ఎన్టీఆర్ పాత్ర గురించి మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ముస్లిం యువకుడు అట. ముస్లిం యువకుడిగా ఎన్టీఆర్ చేసే సందడి ఎలా ఉండబోతోందో అని ఇప్పటి నుంచే లెక్కలు మొదలవుతున్నాయి.

రాంచరణ్ బాబాయిగా
రాంచరణ్, ఎన్టీఆర్ తప్ప రాజమౌళి మిగిలిన నటీనటుల వివరాలు ప్రకటించలేదు. అజయ్ దేవగన్, కన్నడ హీరో యష్ ఇలా చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా తమిళ నటుడు సముద్రఖని ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. సముద్రఖని రాంచరణ్ బాబాయ్ పాత్రలో కనిపిస్తాడని సమాచారం ఈ వార్తల గురించి అధికారిక ప్రకటన రావలసి ఉంది. రాంచరణ్ బ్రిటిష్ కాలంనాటి పోలీసులు పాత్రలో కనియించబోతున్నాడు. అప్పట్లో పోలీసులు ఎలా ఉండేవారో అలంటి కాస్ట్యూమ్స్ లో చరణ్ సందడి చేబోతున్నాడు.

స్వాతంత్య్రానికి పూర్వం
స్వాతంత్రానికి పూర్వం ఉన్న పరిస్థితుల ఆధారంగా విజయేంద్ర ప్రసాద్ అదిరిపోయే కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నఈ చిత్రానికి సంబందించిన రాజమౌళి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. బాక్సింగ్ కూడా ఈ చిత్రంలో భాగంగా ఉంటుందని మరో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలన్నింటిపై క్లారిటీ రావాలంటే రాజమౌళి స్పందించాలి.

విజువల్స్ కోసమే కాదు
ప్రస్తుతం ఏ భారీ బడ్జెట్ చిత్రాన్ని గమనించినా విజువల్ ఎఫెక్ట్స్ అనే మాట బలంగా వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని.. కానీ వాటికోసమే సినిమా తెరకెక్కించడం లేదని విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ శ్రీనివాస్ మోహన్ ఓ ఇంటర్వ్యూలో తేల్చేశారు. డివివి దానయ్య ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎప్పటిలాగే ఈ రాజమౌళి చిత్రానికి కూడా కీరవాణి సంగీత దర్శకుడు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











