తమిళ దర్శకుడితో మహేష్ న్యూ ప్రాజెక్ట్.. స్పైడర్ స్టైల్ లోనే మరో ప్రయోగం?

మహేష్ బాబు ప్రయోగాలకు చాలా దూరంగా ఉంటాడు అనేది అందరికి తెలిసిన విషయమే. గతంలో చేసిన ప్రయోగాలు దెబ్బ కొట్టడంతో చాలా వరకు సేఫ్ జోన్ లోనే సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ డమ్ ఉన్నప్పటికీ తెలుగులోనే సేఫ్టీగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో కమర్షియల్ ఫార్మాట్ లోనే సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

 హిట్టు పడింది అంటే..

హిట్టు పడింది అంటే..

ఇక రాజమౌళి లాంటి దర్శకుడు దొరికితే ఆయన మీద నమ్మకంతో పాన్ ఇండియా కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మహేష్ దర్శకులను ఎంతగా నమ్ముతాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. హిట్టు పడింది అంటే చాలా వరకు దర్శకుడు చెప్పినదల్లా చేస్తాడు. అయితే నెక్స్ట్ ఈ దర్శకుడు స్పైడర్ తరువాత మరో తమిళ్ దర్శకుడితో వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మళ్ళీ తమిళ్ వైపు చూడలేదు.

మళ్ళీ తమిళ్ వైపు చూడలేదు.

గతంలో ఏఆర్.మురగదాస్ దర్శకత్వంలో స్పైడర్ అనే సినిమా చేసిన మహేష్ తమిళ్ లో కూడా ఆ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయించాడు. మెల్లగా కోలీవుడ్ లో కూడా పట్టు సాధించాలని అనుకున్న మహేష్ కి ఆ సినిమా ఊహించని ఫలితాన్ని ఇచ్చింది. డిజాస్టర్ కావడంతో మళ్ళీ తమిళ్ వైపు చూడలేదు.

డైరెక్టర్ మేకింగ్ కి ఫిదా

డైరెక్టర్ మేకింగ్ కి ఫిదా

ఇక చాలా కాలం తరువాత ఒక తమిళ్ దర్శకుడు మహేష్ దృష్టిని ఆకర్షించినట్లు తెలుస్తోంది. మహేష్ తమిళ్ సినిమాలు కూడా రెగ్యులర్ గా చూస్తూ ఉంటాడు. ఇక అందులో భాగంగా కార్తీ 'ఖైదీ', మా నగరం అనే సినిమాలు చూసిన సూపర్ స్టార్ ఆ సినిమాల డైరెక్టర్ లోకేష్ కనగరాజన్ మేకింగ్ కి ఫిదా అయ్యాడట. ప్రస్తుతం ఆ దర్శకుడు విజయ్ తో మాస్టర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Recommended Video

#SarkaruVaariPaata: Kichcha Sudeep To Play Key Role In Mahesh Babu's Movie | Filmibeat Telugu
కథ నచ్చితే మహేష్ కూడా..

కథ నచ్చితే మహేష్ కూడా..

ఆ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక పలుమార్లు మైత్రి మూవీ మేకర్స్ తో మహేష్ అతని గురించి మాట్లాడట. మహేష్ బాబు మనసులో ఉన్న ఇంట్రెస్ట్ గురించి తెలుసుకోని మైత్రి మూవీ మేకర్స్ కూడా లోకేష్ ని లైన్ లో పెడుతోంది. నెక్స్ట్ సినిమాను తమిళ్ తెలుగులో కలిపి తెరకెక్కించే విధంగా దర్శకుడితో డీల్ సెట్ చేసుకున్నారు. కథ నచ్చితే మహేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడాని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X