పవన్ ఆలస్యంతో డైరక్టర్ ప్రక్కకు తప్పుకున్నాడా?

By Srikanya

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ తో అల్లు అరవింద్ నిర్మించబోయే భారీ క్రేజీ చిత్రానికి ప్రముఖ దర్శకుడు మురగదాస్ దర్శకత్వం వహించనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మురగదాస్ కి అల్లు అరవింద్ కి ప్రత్యేకమైన అనుబంధంతో ఈ ప్రాజెక్టు చేయటానికి మురగదాస్ ముందుకు వచ్చాడని చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్లు తెలుస్తోంది. మురగదాస్ స్టోరీ లైన్ చెప్పి చాలా రోజులు అయినా పవన్ తేల్చకపోవటంతో మురగదాస్ ఈ ప్రాజెక్టుకు బై చెప్పి అజిత్ ఓ చిత్రం చేసుకోవటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గీతాఆర్ట్స్ వారు మరో దర్శకుడుతో ముందుకు వెళ్లటానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారన్నమాట.

దర్శకుడు ఎ.ఆర్‌.మురుగదాస్‌ త్వరలో అజిత్‌ హీరోగా ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారా?.. ఔననే అంటున్నాయి చెన్నై చిత్ర వర్గాలు. మురుగ ప్రస్తుతం హిందీలో అక్షయ్‌కుమార్‌ హీరోగా 'తుపాకీ'ని పునర్నిర్మిస్తున్నారు. ఆ తరవాత అజిత్‌తో చిత్రం ఉంటుంది. ఇప్పటికే వారిద్దరి మధ్య కథాంశంపై చర్చలు జరిగాయి. ఈ యేడాదిలోనే దీని చిత్రీకరణ మొదలు కావచ్చు అని తెలుస్తోంది. అంటే పవన్ తో సినిమా లేనట్లే.

ప్రస్తుతం మురగదాస్ హిందీలో తుపాకి రీమేక్ సన్నాహాల్లో ఉన్నారు. విజయ్ హీరోగా రూపొందించిన తుపాకి చిత్రం తమిళంలో వంద కోట్ల వరకూ వసులు చేసి రికార్డులు క్రియేట్ చేసింది. తెలుగులో అయితే ఈ చిత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. విజయ్ కి ఇక్కడ మార్కెట్ లేకపోవటమే కారణమని తేలింది.

పవన్ విషయానికి వస్తే... త్రివిక్రమ్ తో చేయబోయే చిత్రం నువ్వు నాకు నచ్చావ్ తరహా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది. మురగదాస్ తో చేయబోయే చిత్రం ఓ సామాజిక అంశం కలుపుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. మురగదాస్ దర్శకత్వంలో పవన్ చేయటంపై ఫ్యాన్స్ లో ఆనందం వ్యక్తం అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X