SAINDHAV: వెంకటేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. అందుకే దాచి పెట్టారట
టాలీవుడ్‌లో తనదైన చిత్రాలు చేస్తూ సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోగా హవాను చూపిస్తున్నారు దగ్గుబాటి వెంకటేష్. గతంలో ఏకధాటిగా సినిమాల మీద సినిమాలు చేసిన ఆయన.. ఈ మధ్య కాలంలో మాత్రం కాస్త స్లో అయ్యారు.
ఇలా గత ఏడాది 'ఎఫ్3' చిత్రంతో వచ్చి అదిరిపోయే కామెడీని పండించిన వెంకటేష్.. ఇటీవలే 'రానా నాయుడు' వెబ్ సిరీస్‌తో కొత్తగా వచ్చి విమర్శలను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వెంకటేష్ ఇప్పుడు 'సైంధవ్' అనే అదిరిపోయే పాన్ ఇండియా మూవీని చేస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయని చెప్పొచ్చు.

చాలా కాలంగా బిగ్ సక్సెస్ కోసం వేచి చూస్తోన్న విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం 'హిట్' ఫ్రాంచైజీ డైరెక్టర్ శైలేష్ కొలనుతో 'సైంధవ్' అనే సినిమా చేస్తున్నారు. కొన్ని నెలల క్రితమే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ను కూడా మొదలు పెట్టారు. అంతేకాదు, ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకున్నారు.
ఇప్పుడు కూడా చిత్రీకరణను బ్రేకులు లేకుండా జరుపుతున్నారు. ఇలా ఇప్పటికే సగానికి పైగా టాకీ పార్టును కూడా కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ న్యూస్ ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది.
సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రాబోతున్న 'సైంధవ్' మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం కోసం ఎన్నో ఇండస్ట్రీల నటీనటులను తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్‌గా వెలుగొందుతోన్న ఆర్యను ఈ చిత్రం కోసం తీసుకున్నారు. అతడు ఇందులో ఓ ముఖ్యమైన పాత్రను చేస్తున్నట్లు తెలిసింది. ఈ రోల్ సినిమా కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందట. అందుకే ఆర్య ఈ చిత్రంలో నటిస్తున్న విషయాన్ని సీక్రెట్‌గా ఉంచారనే టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా.. వెంకటేష్ - శైలేష్ కొలను కలయికలో రాబోతున్న 'సైంధవ్' మూవీలో శ్రద్దా శ్రీనాథ్, ఆండ్రియా, రుహానీ శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్రను చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న విడుదల చేయబోతున్నారు. ఇక, ఈ మూవీ చేతబడుల నేపథ్యంతో వస్తుందని ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











