Pushpa 2 Leak: పుష్ప2 లో మరో స్టార్ హీరో... నీ యవ్వ ఇక తగ్గేదేలే!

దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఎదురుచూస్తున్న సినిమాల్లో పుష్ప 2. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకంటించారు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టులో మరో స్టార్ హీరో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో ఎవరు.. ఏంటి అనే వివరాలు.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కించారు. ఇక ఈ మూవీ 2021 డిసెంబర్ లో విడుదల కాగా... బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇక ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు సుక్కు.

 Pushpa 2

అల్లు అర్జున్, సుక్కు.. పుష్ప ది రూల్ కోసం తెగ కష్టపడుతున్నారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. వేర్ ఇజ్ పుష్ప అని విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతే కాదు పుష్ప ది రూల్ నుంచి విడుదల చేసిన బన్నీ లుక్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సారి సుక్క భారీ స్థాయిలో ప్లాన్ చేశాడు అని అభిమానులు అనుకుంటున్నారు.

ఇక పుష్ప ది రూల్ సినిమాను ఆగస్టు 15వ తేదీ, 2024 సంవత్సరంలో రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు. దీనితో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఇక పుష్ప 2 1000కోట్ల రూపాయలను కలెక్ట్ చేస్తుందని ఇప్పటికే ట్రెడ్ అనలిస్టులు చెబుతున్నారు. ఇప్పటికే పుష్ప సినిమాలో బన్నీ క్యారెక్టర్ కు ఉత్తమ నటుడి అవార్డు లభించింది. దీనికి తగ్గట్లుగానే సోషల్ మీడియాలో పుష్ప2కి సంబంధించిన క్రేజీ అప్డేట్స్ లీక్ అవుతూ వస్తున్నాయి.

 Pushpa

తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.... ఈ సినిమాలో తమిళ్ హీరో కార్తీ కూడా నటించబోతున్నారు అంటూ రూమర్స్ మొదలయ్యాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. కానీ ఒకవేళ పుష్ప సినిమాలో కార్తి కూడా చేరితే... సినిమా నెక్ట్స్ లెవెల్ అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ లో ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నాడు. అంతే కాదు సునీల్, ధనుంజయ్,అనసూయ వంటి నటులతో పాటు... విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో విలన్ అనే రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఇప్పుడు హీరో కార్తి కూడా చేరడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక కార్తీ ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో ఉంటారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు ఈ పాత్ర చాలా చాలా ముఖ్యమని సమాచారం. ఈ సినిమాలో కార్తి... పుష్ప రాజ్ బ్రదర్ గా కనిపించబోతున్నారని అంటున్నారు. చూడాలి ఇక అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X