మల్టీస్టారర్‌గా మహేశ్, రాజమౌళి మూవీ: సూపర్ స్టార్‌తో ఊహించని హీరో.. జక్కన్న మాస్టర్ ప్లాన్

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్‌ల గురించి ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులంతా వేచి చూస్తున్నారు. ఫలానా దర్శకుడితో.. ఫలానా హీరో కలిసి సినిమా చేయాలని కోరుకుంటూ ఉంటారు. ఇందులో దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కలయిక ఒకటి. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా చేయాలని చాలా కాలంగా అభిమానుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి.

కానీ, ఎందుకనో ఇప్పటి వరకూ వీళ్లు జతకట్టలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరికొన్ని రోజుల్లోనే మహేశ్, రాజమౌళి కాంబోలో సినిమా రాబోతుంది. ఈ నేపథ్యంలో దీని గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దీని నుంచి ఓ సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా వార్త? పూర్తి వివరాలు మీకోసం!

మహేశ్ అలా.. రాజమౌళి ఇలా

మహేశ్ అలా.. రాజమౌళి ఇలా

ఈ మధ్య కాలంలో హ్యాట్రిక్ హిట్లను అందుకుని ఫుల్ ఫామ్‌తో ఉన్నాడు మహేశ్ బాబు. ఈ జోష్‌తోనే ఇప్పుడు అతడు పరశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. ఇక, రాజమౌళి ఇప్పుడు RRRతో రెడీగా ఉన్నాడు. ఈ భారీ మూవీలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించారు. ఇది పాన్ వరల్డ్ రేంజ్‌తో మరికొద్ది రోజుల్లోనే భారీగా విడుదల కాబోతుంది.

నిరీక్షణకు తెర దించిన స్టార్లు

నిరీక్షణకు తెర దించిన స్టార్లు

తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకుడిగా ఎస్ఎస్ రాజమౌళి పేరొందాడు. ఈయనతో ఒక్క సినిమా అయినా చేయాలని స్టార్ హీరోలందరూ కోరుకుంటుంటారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ స్టార్ డైరెక్టర్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్నాడు. దీన్ని కేఎల్ నారాయణ నిర్మించబోతున్నారు. ఈ విషయాన్ని అటు హీరో, ఇటు డైరెక్టర్ ధృవీకరించేశారు.

తండ్రి చేతికి కీలక బాధ్యతలు

తండ్రి చేతికి కీలక బాధ్యతలు

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన కాంబో కావడంతో ఈ ప్రాజెక్టుపై అప్పుడే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా కథను తయారు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. స్క్రిప్ట్ బాధ్యతను ఇప్పటికే తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు అప్పగించాడు జక్కన్న. ఆయన చాలా రోజులుగా దీనిపై వర్క్ చేస్తున్నారని స్వయంగా తెలిపారు.

సినిమా నేపథ్యం అదేనంటూ

సినిమా నేపథ్యం అదేనంటూ

మహేశ్ బాబు - రాజమౌళి కలయికలో రాబోయే ప్రాజెక్టు గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతోన్నాయి. మరీ ముఖ్యంగా ఈ మూవీ స్టోరీ ఇదేనంటూ ఇప్పటికే కొన్ని లైన్లు తెరపైకి వచ్చాయి. ఇది సైన్స్ ఫిక్షన్ నేపథ్యం ఉన్న కథతో రూపొందనుందని కొందరు అంటే.. రాజుల కాలం నాటి స్టోరీతో వస్తుందని మరికొందరు.. అడ్వెంచర్ లైన్‌తో రానుందని ఇంకొందరు అంటున్నారు.

పట్టాలెక్కడానికి మరింత టైమ్

పట్టాలెక్కడానికి మరింత టైమ్

నిజానికి మహేశ్ బాబు.. ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా గత ఏడాది చివర్లోనే మొదలవుతుందని అంతా అనుకున్నారు. కానీ, కరోనా కారణంగా RRR వాయిదా పడడంతో ఈ ప్రాజెక్టు కూడా ఆలస్యం అవుతోంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు కూడా త్రివిక్రమ్‌తో సినిమాను చేస్తున్నాడు. అంటే అది పూర్తయ్యాకే ఇది పట్టాలెక్కే ఛాన్స్ ఉందన్నది అర్థం అవుతోంది.

భారీ మల్టీస్టారర్‌గా క్రేజీ ప్రాజెక్ట్

భారీ మల్టీస్టారర్‌గా క్రేజీ ప్రాజెక్ట్

టాప్ హీరో, టాప్ డైరెక్టర్ అయిన మహేశ్ బాబు - రాజమౌళి కలయికలో రాబోయే ప్రాజెక్టు గురించి ఏ వార్త బయటకు వచ్చినా సంచలనం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా దీని గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. దీన్ని కూడా మల్టీస్టారర్ మూవీగానే తెరకెక్కించబోతున్నాడట దర్శకధీరుడు.

మహేశ్‌తో పాటు ఆ స్టార్ హీరో

మహేశ్‌తో పాటు ఆ స్టార్ హీరో

ప్రస్తుతం వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. మహేశ్ బాబు.. రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో కూడా నటిస్తున్నాడట. ఆ హీరో ఎవరన్నది బయటకు రాలేదు కానీ.. తమిళ సినీ పరిశ్రమకు సంబంధించిన ఓ బడా స్టార్ హీరో అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన మరికొద్ది రోజుల్లోనే రానుందని అంటున్నారు. మరి ఈ వార్తలో ఎంత నిజముందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X