నీ భార్య నాకు కావాలి.. నా మాజీ ప్రేయసిని తిరిగి ఇస్తావా? హీరోయిన్ భర్తకు హీరో రిక్వెస్ట్
సినిమా ఇండస్ట్రీలో అఫైర్లు, రిలేషన్‌షిప్స్, లివింగ్ టుగెదర్ లాంటి విషయాలు సర్వసాధారణంగా కనిపిస్తాయి. హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమాయణాలు, ఆ తర్వాత బ్రేకప్స్ సహజంగానే జరిగిపోతుంటాయి. కానీ ఇప్పటి వరకు ఇలాంటి అఫైర్లు, బ్రేకప్స్ చాలానే చూశాం. బ్రేకప్ తర్వాత కూడా వారు మళ్లీ కలిసి జీవించడం కూడా కనిపించాయి. ఇలా ఓ హీరో, హీరోయిన్ పీకల్లోతు ప్రేమలో ఉండి.. సహజీవనం చేసి.. ఆ తర్వాత ఒకరికొకరు టాటా చెప్పుకొన్నారు. కానీ ఆ తర్వాత మరో ఫిలిం సెలబ్రిటీతో ఆ హీరోయిన్ పెళ్లి చేసుకొని ఉండగా.. ఆమె కావాలని మాజీ ప్రియుడు కోరడం తమిళ సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతున్నది. ఆసక్తికరంగా మారిన వారి అఫైర్ విషయంలోకి వెళితే..
సంప్రదాయ కుటుంబ నుంచి తమిళ సినిమా పరిశ్రమలో హీరోయిన్ అనతికాలంలోనే అగ్ర హీరోయిన్‌గా పేరు తెచ్చుకొన్నది. దక్షిణాదిలో టాప్ హీరోలతో కలిసి సినిమాలు చేసింది. తొలుత గ్లామర్ పాత్రలు చేసి ఒప్పించిన ఈ అందాల భామ.. ఆ తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్, పవర్‌ఫుల్ పాత్రల్లో జీవించింది. అలా తన కెరీర్‌ను కొనసాగించిన సమయంలో ఓ హీరోతో ప్రేమలో పడింది. ఆ సదరు కథానాయకుడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. ఇక అందరూ వారిద్దరూ పెళ్లి చేసుకొంటారనే సమయంలో అనూహ్యంగా విడిపోవడం అందర్నీ షాక్ గురి చేసింది.

ఆ హీరో, హీరోయిన్లు బ్రేకప్ తర్వాత స్నేహపూర్వకంగానే ఉన్నారు. వారిద్దరూ ప్రొఫెషనల్‌గా బిజీ అయ్యారు. వారి వారి సినిమాలతో నిత్యం బిజీగా ఉండిపోయారు. అయితే సదరు హీరోయిన్ వేరే సినీ ప్రముఖుడికి చేరువైంది. ఆ తర్వాత వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ఇద్దరి ప్రేమ వ్యవహారం మీడియాలో కూడా బలంగా వినిపించింది. ఆ ఇద్దరి ప్రేమ కథ కంచికి చేరుతుందా? అనే అనుమానాలు బలంగా కనిపించాయి. అయితే ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ ఆ ఇద్దరు పెళ్లి చేసుకొని ఆందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
ఆ హీరోయిన్ కొత్త కాపురం సవ్యంగానే సాగింది. ఆమె తన దాంపత్య జీవితం ఎంజాయ్ చేస్తూనే వరుస సినిమాల్లో నటించింది. అయితే సినీ ప్రముఖుడితో తన మాజీ ప్రేయసి వివాహాన్ని హీరో జీర్ణించుకోలేకపోయారు. అయితే తనతో స్నేహంగా ఉన్న హీరోయిన్‌తో తన బాధను పంచుకొన్నాడు. కానీ తన భర్తకు దూరం కావడం ఇష్టం లేక.. మాజీ ప్రియుడిని కోరికను తిరస్కరించింది.
అయితే హీరోతో స్నేహం విషయంలో ఆ హీరోయిన్‌కు, భర్తకు మధ్య విబేధాలు తలెత్తాయనే విషయం సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే భర్త, భార్యల మధ్య అంతగా సాన్నిహిత్యం ప్రస్తుతం లేదనే విషయం హీరోకు తెలిసింది. ఆ తర్వాత తన మాజీ ప్రేయసి భర్తను కలిసేందుకు హీరో ప్రయత్నాలు చేశాడు. ఆనంతరం తన మాజీ ప్రేయసి భార్యను హీరో కలిసి తమ మధ్య ఉన్న బంధం గురించి చెప్పాడు. అయితే సదరు హీరో వ్యవహారం నచ్చకపోవడంతో ఆయన మండిపడ్డారు అనే విషయం మీడియాలో ప్రచారమైంది.
అయితే ఆ హీరో తన ప్రయత్నాలు అలానే కొనసాగించి.. ఓ సమయంలో నీ భార్యను నాకు ఇచ్చేయ్.. నేను పెళ్లి చేసుకొంటానని చెప్పారట. దాంతో హీరోకు, మాజీ ప్రేయసి భర్తకు మధ్య భారీగా గొడవలు జరిగాయి. హీరో సన్నిహితులతో ఈ విషయం చెప్పి అతడిని దారిలో పెట్టాలని సున్నితంగా మందలించారట. అయిత ఈ సందర్భంలో హీరో అలాగే ప్రవర్తించడంతో.. నా వద్ద నీవు ఇలా చేసినా.. నా భార్యను మళ్లీ సంప్రదించినా.. మీడియాను పిలిచి ప్రెస్ మీట్ పెడుతాను. నీ బండారం బయటపెడుతాను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. దాంతో సదరు హీరో సైలెంట్ అయిపోయారు. దాంతో ఆ వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది అని సినీ వర్గాలు చెప్పుకొంటున్నారు.


Click it and Unblock the Notifications











