దేవుడా..అప్పుడే కాపీ అని తేలిపోయిందా? (ఫొటో)
హైదరాబాద్: గతంలో లాగ లేవు పరిస్ధితులు. ఓ చిత్రానికి సంభందించిన ఏదైనా విషయం బయిటకు వస్తే... దాని మూలం ఎక్కడైనా ఉందేమోనని నెట్ జనలు జల్లెడ పట్టేస్తున్నారు. ముఖ్యంగా హీరోకు ఉండే యాంటీ ఫ్యాన్స్ ఈ పనిలో బిజీగా ఉంటూంటారు. దాంతో ఫిల్మ్ మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే అప్పటికీ దొరికిపోతూనే ఉన్నారు. ఇదిగో సూర్య తాజా చిత్రం మాస్ కు సంభందించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఎంతో సేపు కాలేదు అప్పుడే దానికి సంభందించిన ఒరిజనల్ ఇలా బయిటకు వచ్చేసింది. ఈ పోస్ట్ర హాలీవుడ్ చిత్రం The Bourn Ultimatum పోస్టర్ కి నకలు అని తేలింది.
తమిళ హీరో సూర్య చేసినట్లుగా అటు మాస్, ఇటు క్లాస్ రోల్స్ సౌత్ లో ఒకే సారి చేసే హీరోలు లేరనే చెప్పాలి. సికిందర్ లో తన స్టైలిష్ లుక్ లో అదరకొట్టిన సూర్య ఈ సారి పూర్తి మాస్ లుక్ తో మన ముందుకు రావటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఆయన చిత్రం చేస్తున్నారు. ఆ చిత్రానికి 'మాస్' అనే టైటిల్ పెట్టారు. న

'మంగాత్తా', 'బిరియాని' విజయాలతో హవా చాటుకుంటున్న వెంకట్‌ప్రభు తాజాగా సూర్యతో మాస్‌మసాలా చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు 'మాస్' అని పేరు కూడా పెట్టారు. స్టూడియో గ్రీన్ బ్యానరుపై కేఈ జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు.
చిత్రంలో సూర్యకు సంబంధించిన సన్నివేశాలు చాలా బాగా వచ్చాయంటున్నారు. ఇందులో సూర్యకు జంటగా నయనతార, ఎమీజాక్సన్ నటిస్తున్నారు. ఎప్పటిలాగే వెంకట్‌ప్రభు తమ్ముడు ప్రేమ్‌జీ ఈ సినిమాలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











