పూరీ జగన్నాధ్ దర్శకత్వలో 'గజనీ' సూర్య
త్వరలో పూరీ జగన్నాధ్...తమిళ స్టార్ హీరో సూర్యని డైరక్ట్ చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే సిట్టింగ్ లు జరిగాయని, రామ్ గోపాల్ వర్మ దగ్గరుండి ఈ ప్రాజెక్టుని ఓకే చేయించారని తెలుస్తోంది. అలాగే జె.డి చక్రవర్తితో హోమం, సిద్దం చిత్రం నిర్మించిన కోనేరు కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు. ఇక ప్రస్తుతం సూర్య..రామ్ గోపాల్ వర్మ..రక్త చరిత్రలో మద్దెల చెరువు సూరిగా కీలకమైన పాత్ర చేస్తున్నారు. అతని సరసన గంగుల భానుమతిగా ప్రియమణి నటిస్తోంది. అలాగే ప్రస్తుతం పూరీ..గోలీమార్ చిత్రం రిలీజ్ హడావిడిలో ఉన్నారు. గోపీచంద్ తో చేసిన ఈ చిత్రం ఎనకౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిందని తెలుస్తోంది. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియమణి హీరోయిన్ గా చేసింది. ఈ చిత్రం రిలీజ్ అనంతరం సూర్య ప్రాజెక్టు స్టార్టయ్యే అవకాశం ఉంది.
More from Filmibeat
పూరీ జగన్నాధ్ సూర్య రక్త చరిత్ర రామ్ గోపాల్ వర్మ గోలీమార్ puri jagannath surya raktha charitra ram gopal varma golimaar


Click it and Unblock the Notifications











