»   » చర్చలు జరుగుతున్నాయి :మహేష్ నెక్ట్స్ ..మల్టిస్టారర్?

చర్చలు జరుగుతున్నాయి :మహేష్ నెక్ట్స్ ..మల్టిస్టారర్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శ్రీమంతుడు చిత్రం తో సూపర్ హిట్ కొట్టిన మహేష్ బాబు ఇప్పుడు బ్రహ్మోత్సవం అంటూ మరో ఎంటర్టైనర్ తో మన ముందుకు రాబోతున్నారు. అయితే బ్రహ్మోత్సవం చిత్రం తర్వాత ప్రాజెక్టు కూడా ఖరారు అయిపోయింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఓ మల్టి స్టారర్ అయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది.

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, ప్రముఖ దర్శకుడు ఏఆర్‌ మురగదాస్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. దీనికి ఎనిమీగ అనే టైటిల్‌ నిర్ణయించినట్లు సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో విజయ్ కూడా నటించనున్నట్లు తెలుస్తోంది.

Tamil hero Vijay in Mahesh's Next?

ఈ మేరకు మురుగదాస్ ఇప్పటికే మహేష్ బాబుతో స్క్రిప్ట్ ని కూడా ఫైనల్ చేసుకున్నాడు. ఇప్పటికే మురుగదాస్ విజయ్‌తో మాట్లాడినట్లు తెలుస్తోంది. అలాగే...విజయ్ కూడా మహేష్ బాబు కాంబినేషన్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది.

కానీ ఈ సినిమాలో విజయ్ పాత్ర కొద్ది నిముషాలకే పరిమితం అవుతుందని తెలుస్తోంది. అంటే దాదాపు ఓ 20 నిముషాల పాత్రలో విజయ్ నటించనున్నాడని సమాచారం. తెలుగు లో విజయ్ కు మార్కెట్ కావాలి..అందుకు మహేష్ ఉపయోగపడతాడు. అలాగే తమిళంలోనూ విజయ్ ద్వారా మహేష్ మరింతగా జనాల్లోకు దూసుకుపోవచ్చని ఈ మల్టిస్టారర్ స్ట్రాటజీతో వెళ్తున్నట్లు సమచారం.

Tamil hero Vijay in Mahesh's Next?

మహేష్ బాబు, మురుగదాస్, విజయ్‌కి ఇప్పటికే మంచి మార్కెట్ వుంది. తద్వారా కోట్లాది కలెక్షన్స్ ఖాయమని సినీ జనం అంటున్నారు.బాలీవుడ్‌ తార శ్రద్ధాకపూర్‌ను ఈ చిత్రానికి హీరోగా ఎంపిక చేశారు. తెలుగు, తమిళంలో ఆమెకిదే తొలి చిత్రం.

రూ.80కోట్ల భారీ వ్యయంతో తిరుపతి ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం మహేష్‌.. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవంలో నటిస్తున్నారు. ఆ చిత్రం తరువాత ఏప్రిల్‌లో ఎనిమీ ప్రారంభం కానుంది. త్వరలోనే దీనిపై అధికార సమాచారం వెలువడనుంది.

English summary
Murugadoss who is directing the 100crs project with Mahesh is planning to cast Ilayadalapathi Vijay to increase stakes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu