Don't Miss!
- Sports ఆ రూల్ మా కొంపముంచింది- రుతురాజ్
- News మే 1 నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కోలీవుడ్ హీరో విజయ్‌ని టార్గెట్ చేసిన రాజకీయ నేతలు.. కాలు పెడితే కాటేయలని.. కుట్ర..?
కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సినీ తారల బాక్సాఫీస్ లెక్కలు ఎలా ఉన్నా కూడా కొన్నిసార్లు వారి క్రేజ్ ని పసిగట్టడం చాలా కష్టమైనా పని. ఎందుకంటే అక్కడి స్టార్ హీరోలకు ఉండే అభిమానుల సంఖ్య ఎవరు ఊహించని విధంగా ఉంటుంది. ప్రస్తుతం విజయ్ రేంజ్ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఇక గత కొంత కాలంగా దళపతిపై తమిళ రాజకీయ నేతలు స్పెషల్ గా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది..
ఊహించని పరిణామాలు
ప్రస్తుతం తమిళనాడులో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. అంతే కాకుండా అక్కడ రాజకీయాల్లో కూడా ఊహించని పరిణామాలు చోటుచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు అనగానే అందరికి గుర్తొచ్చేది అక్కడి రాజకీయా ఎత్తుగడలే.. అక్కడ ఎలక్షన్స్ జరిగితే దేశమంతా ఆ రిజల్ట్ పై స్పెషల్ గా ఎట్రాక్ట్ అవుతుంది.
దళపతి విజయ్ కూడా
ఇక రానున్న రోజుల్లో పలువురు సినీ తారలు తమిళ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కమల్ హాసన్ తన పార్టీని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేస్తుండగా.. త్వరలో రజినీకాంత్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వారితో పాటు దళపతి విజయ్ కూడా తమిళ రాజకీయాలపై స్పెషల్ గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
కావాలనే అలా చేశారట..
విజయ్ అలాంటి ఆలోచనతో ఉన్నాడనే అనుమానాలతో కావాలని అతనిపై ఐటి రెయిడ్స్ జరిపించారని ఒక టాక్ కూడా వచ్చింది. అయితే ఎలాగైనా విజయ్ ని రాజకీయాల్లో ఏ మాత్రం జోక్యం చేసుకొనివ్వవద్దని అక్కడి అధికార పక్షం ప్రణాళికలు రచిస్తున్నట్లు ఓ వర్గం కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
Recommended Video
వేటు వేయాలని..
విజయ్ ఏ మాత్రం పాలిటిక్స్ గురించి మాట్లాడినా కూడా అతనిపై వేటు వేసే విధంగా మరికొందరు ప్లాన్ చేసుకుంటున్నట్లు కూడా రూమర్స్ వస్తున్నాయి. విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ రోజురోజుకి పెరుగుతోంది. ముఖ్యంగా తమిళనాడులో ఎక్కువ శాతం యువత అతని వెంటే ఉన్నట్లు సమాచారం. ఐటి రెయిడ్స్ జరిగిన అనంతరం విజయ్ ని చూడటానికి షూటింగ్ లొకేషన్ కి పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చిన విషయం తెలిసిందే.