డైరక్టర్ తో నాకు ఆ సంభంధం లేదు...

ఆయనతో కలిసే పార్టీలకు, పబ్‌లకు వెళ్తోంది. ఈ విషయాన్ని అడిగితే తనుశ్రీ ఇలా చెప్పింది... ''దూబే నాకు ఎంతో సన్నిహితుడైన మిత్రుడు. ఆయన తీయబోయే చిత్రంలో నటించబోతున్నాను. అందులో భాగంగా పలుమార్లు కథా చర్చల్లో పాల్గొన్నాను. అంతకు మించి మా మధ్య ఏమీ లేదు.ఆయనతో నాకు సంభంధం లేదు. ఏమిటో ఎంత చెప్పినా అపార్థం చేసుకొంటూనే ఉంటారు''. అంటూ దిగాలు పడిపోయింది.
ఇక తనుశ్రీ ప్రస్తుతం 'రామా ది సేవియర్' అనే సినిమాలోనూ నటించడానికి సంతకం చేసింది. సెట్స్‌లో ఉన్న సహ నటీనటుల్ని లెక్కచేయదని ఈమె మీద ఓ అపవాదు ఉంది. దీనిపై ప్రశ్నిస్తే.. ''ఎవరన్నారు.. ఆ మాట? నా సన్నిహితులతో ఎలా మసలుకొంటానో నా యూనిట్ సభ్యులతోనూ ఇంచుమించు అలాగే ఉంటాను. ఎవరో లేనిపోనివి కల్పిస్తున్నారంతే'' అని చెప్పింది. ఏదైమైనా ఆమె తనుశ్రీ దత్తా కాదు తనుఫ్రీ దత్తా అనిపించుకుంది.


Click it and Unblock the Notifications











