తెలుగులో తాప్సీ మరో క్రేజీ ప్రాజెక్టుకి ఎంపిక
హైదరాబాద్ : హిట్టు,ప్లాప్ లతో సంభదం లేకుండా తమిళ,తెలుగు భాషల్లో దూసుకుపోతున్న హీరోయిన్ తాప్సీ. ఈ ఢిల్లీ బ్యూటీ తాప్సీ తాజాగా మరో తెలుగు చిత్రం కమిటయ్యి తోటి హీరోయిన్స్ కి ఝలక్ ఇచ్చింది. రామ్ సరసన ఓ చిత్రంలో ఆమె హీరోయిన్ గా ఎంపికైంది. రామ్ హీరోగా స్రవంతి రవికిశోర్ ఈ చిత్రం నిర్మించనున్నారు. ఈ చిత్రంలో తాప్సీని హీరోయిన్ గా అడిగారు. డేట్స్ ని కష్టపడి ఎడ్జెట్ చేసుకుని మరీ కాల్ షీట్స్ ఖరారు చేసింది.
దానికి కారణం ప్రేక్షకులలో స్రవంతి మూవీస్‌కి ఉన్న మంచి పేరు, రామ్‌కి యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ అంటోంది. అంతేకాదు ఒక సినిమా చేయడానికి బేనర్, హీరో మాత్రమే కాదు కథ, పాత్రకు కూడా తాప్సీ ప్రాధాన్యం ఇస్తానని చెప్తోంది. ఈ రెండూ కూడా నచ్చబట్టే ఈ బ్యూటీ ఈ చిత్రాన్ని అంగీకరించారని అంటోంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని, తన కెరీర్‌కి ప్లస్ అవుతుందనే అభిప్రాయంతో డైరీని ఓసారి తిరగేసి మొత్తానికి ఈ చిత్రానికి డేట్స్ కేటాయించేశింది తాప్సీ.
ఇక ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు,మిగతా విషయాలు నిర్మాత విడుదల చేసే ప్రకటన తో తెలుసుకోవటం బెస్ట్ అంటోంది. ఇక ఒక తమిళ చిత్రంతో పాటు తెలుగులో దాదాపు మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారామె. హిందీలో తాప్సీ నటించిన 'చష్మే బద్దూర్' త్వరలో విడుదల కానుంది.తాప్సీ ముఖంలో కనుపడే అమాయికత్వం ఈ చిత్రానికి ప్లస్ అవుతుందంటున్నాడు. ఇక తాప్సీ ఈ ఆఫర్ కి పులకించిపోతోంది. హీరోలు ఎవరు అని అడగకుండా వెంటనే కమిటైపోయా అంటోంది. ఎంత ట్రై చేసినా త్రిషకు,ఇలియానా,కాజల్ కు బాలీవుడ్ లో రాని బ్రేక్ ఈమెకు వస్తుందేమో చూడాలి అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం ఆమె తెలుగులో గుండెల్లో గోదారి చిత్రాన్ని పూర్తి చేసింది. ఈ చిత్రం మరందేన్ మనిత్తేన్ పేరుతో తమిళంలోను విడుదల కానుంది.
ప్రస్తుతం 'షాడో', 'గుండెల్లో గోదారి' చిత్రాల్లో నటిస్తోంది. 'ఛస్మే బద్దూర్' అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి కూడా ప్రవేశిసించి అక్కడా సెటిల్ అవ్వాలనే చూస్తోంది. అంతేకాదు 'డబుల్స్' అనే చిత్రంతో మలయాళ చిత్ర సీమలోకి కూడా అడుగుపెడుతున్నారు తాప్సీ. అందులో మమ్ముట్టి హీరో. బాలీవుడ్ స్టార్ డైరక్టర్ డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రూపొందుతున్న క్లాసిక్ చిత్రం ఛస్మే బద్దూర్ రీమేక్ లో ఎంపికవటం చాలా ఆనందాన్ని ఇస్తోంది అంటోంది. ముగ్గురు అబ్బాయిలు...ఒకమ్మాయి మధ్య జరిగే ఈ తమాషా కథలో కాస్త సెక్సీ లుక్ తో పాటు రెగ్యులర్ హీరోయిన్ కాకూడదని ఆయన భావించి ఆమను ఎంపికచేసారని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











