మంచు ఫ్యామిలీకి మస్కా కొట్టిన హాట్ అండ్ సెక్సీ హీరోయిన్..!?
మంచు మోహన్ బాబు కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉండే తాప్సీ ఇటీవల వారిని ఖాతరు చేయడం లేదని సమాచారం. 'ఝుమ్మంది నాదం"లో నటించిన ఆమె తన అందాల్ని ఆరబోసింది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు, ఆఖరికి ప్రమోషన్స్ కు కూడా ఎంతో సహకరించిన ఆమె లక్ష్మీ మంచుతో చాలా సన్నిహితంగా ఉండేది. మోహన్ బాబు కూడా తాప్సీతో కలిసి నటించాలని ఉందని అప్పట్లో సభలో చెప్పాడు కూడా.
విశ్వసనీయ సమాచారం ప్రకారం మంచు లక్ష్మీ నిర్మించనున్న తాజా చిత్రంలో తాప్సీ నటించడానికి నిరాకరించిందట. మోహన్ బాబు కీలకపాత్ర పోషించనున్న ఈ చిత్రంలో ఆమె కేవలం అతని వల్లే తప్పుకుందని వినికిడి. గతంలో అగ్రిమెంట్ సైన్ లో తమ బ్యానర్ లో సినిమాలు చేయాలని సంతకాలు తీసుకున్న మంచు కుటుంబం ఈవిషయంలో ఛాంబర్ దృష్టికి తెచ్చారు. అయితే తాప్సీ ఇక్కడ మెంబర్ కాకపోవడంతో.. వారు ఏమీ చేయలేకపోతున్నారు.
tapsi mohan babu lakshmi prasanna manchu manoj jhummandi naadam తాప్సీ మోహన్ బాబు లక్ష్మీ ప్రసన్న మంచు మనోజ్ ఝుమ్మంది నాదం


Click it and Unblock the Notifications