హీరో నితిన్‌తో రొమాన్స్ చేయనున్న తాప్సీ!
ఇష్క్ విజయంతో మంచి జోష్ మీద ఉన్న యువ హీరో నితిన్ త్వరలో సెక్సీ హీరోయిన్ తాప్సీతో జతకట్టబోతున్నాడు. ఇద్దరూ జంటగా త్వరలో ఓ సినిమా రూపొంద బోతోందని ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తున్నారు? ఎవరు నిర్మిస్తున్నారు అనే విషయాలు మాత్రం వెల్లడి కాలేదు. త్వరలోనే పూర్తి సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.
తాప్సీ ప్రస్తుతం వెంకటేష్ సరసన 'షాడో' చిత్రంతో పాటు, రవితేజతో 'దరువు', మంచు లక్ష్మి సినిమా 'గుండెల్లో గోదారి' చిత్రాల్లో నటిస్తోంది. ఆమె ఇటీవల నటించిన 'మొగుడు' సినిమా ఘోరంగా పరాజయం పాలైంది. పరిశ్రమకు వచ్చి చాలా రోజులైన తాప్సీ కెరీర్లో చెప్పుకొదగ్గ హిట్లేమీ లేవు. ప్లాపులు మాత్రం బోలెడు ఉన్నాయి. అయినా సరే తాప్సీకి అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. పిటపిటలాడే ఆమె గ్లామరే తాప్సీకి అవకాశాలు తెచ్చి పెడుతోంది.
నితిన్ నటించిన 'ఇష్క్' మూవీ ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. ఇందులో నితిన్ సరసన నిత్య మీనన్ నటించగా విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. విక్రమ్ గౌడ్ నిర్మాత కాగా అనుప్ రూబెన్స్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











