తాప్సీ నోరు జారిందని ప్రభాస్ చిరాకు పడ్తున్నాడు
ఝుమ్మంది నాదం చిత్రంతో పరిచయమైన తాప్సీ తాజాగా ప్రభాస్,దశరధ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలో చేస్తోంది. ఈ చిత్రం టైటిల్ అఫీషియల్ గా ఏదీ అనుకోలేదు. అయితే గత కొద్ది రోజులుగా మిస్టర్ ఫెరఫెక్ట్ అనే టైటిల్ ఈ చిత్రానికి పెట్టే అవకాశం ఉందంటూ వినపడుతోంది. కానీ హీరో,దర్శక,నిర్మాతలు ఇంతకన్నా మంచి టైటిల్ రాకపోతే అప్పుడు చూద్దాం అన్నట్లు ప్రొడక్షన్ నేమ్ తోనే వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే తాప్సీ తాజాగా ట్విట్టర్ లో....నేను చేస్తున్నమిస్టర్ ఫెరెఫెక్ట్ చిత్రం మూడవ షెడ్యుల్ షూటింగ్ మొదటి రోజు జరిగింది అంటూ పెట్టింది. దాంతో మేమే ఇంకా ఏ టైటిలూ అనుకోవటం లేదు..నువ్వు మిస్టర్ ఫెరఫెక్ట్ అని టైటిల్ ఫిక్స్ చేసి జనాలకి తెలియచేస్తావా అని ప్రభాస్ ఆమెతో అన్నారుట. తాను పొరపాటున నోరు జారినట్లుగా ట్వీట్ జారానని అందిట. అయితే దశరధ్ కలగచేసుకుని మంచిదే జరిగింది. ఆమె ట్వీట్ కి మంచి టైటిల్ అని స్పందన వస్తే అదే ఫిక్స్ చేయవచ్చు అన్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం యూనిట్ ఊటీలో ఉంది. నెక్ట్స్ షెడ్యూల్ హైదరాబాద్ ప్లాన్ చేసారు. కాజల్ మెయిన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











