మోహన్ బాబు అంకుల్ తో ఎలాంటి గొడవలు లేవు..!
మోహన్ బాబు కుటుంబంతో చనువుగా తిరిగిన తాప్సీ కొద్ది రోజులుగా వారితో దూరంగా ఉంటోంది. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా మంచు ఫ్యామిలీ మెంబర్స్ ని కలవకుండా వెళ్లని తాప్సీ ఇటీవల వారింటికి వెళ్లడమే మానేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మంచు లక్ష్మీతో స్నేహం పూర్తిగా చెడిందని, మోహన్ బాబుని దూషించిందని తాప్సీ గురించి పుకార్లు షికారు చేస్తున్నాయి.
ఓ టీవి ఛానల్ ఈ రూమర్స్ గురించి ప్రసారం చేయగా చూసిన తాప్సీ అసలు ఇలాంటివి ఎవరు పుట్టిస్తారంటూ మండిపడింది. తనకి మోహన్ బాబు అంకుల్ తో ఎలాంటి గొడవలు లేవని, ఆయనని తానేమీ అనలేదని, హైదరాబాద్ లో తనకంటూ బంధువులు ఎవరైనా ఉంటే అది మంచు ఫ్యామిలీనేనని తాప్సీ పేర్కొంది. ఇకపై తనగురించి ఇలాంటి ప్రచారం చేయాలనుకునేవారు ముందుగా నిజానిజాలు కనుక్కుంటే మంచిదని హితవు చెప్పింది.


Click it and Unblock the Notifications











