తాప్సీతో బ్యాంకాక్ లో అల్లు అర్జున్ రొమాన్స్

By Srikanya

హైదరాబాద్: పూరీ జగన్నాధ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో త్వరలో తెరకెక్కనున్న చిత్రం 'ఇద్దరమ్మాయిలతో'. ఈ చిత్రంలో మొదటి హీరోయిన్ గా శృతి హాసన్ ని ఎంపిక చేస్తే సెకండ్ హీరోయిన్ గా తాప్సీని ఎంపిక చేసినట్లు సమాచారం. ఎప్పుడూ వెరైటీ టైటిల్స్‌తో సినిమాలు చేసే పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి టైటిల్ తోనే మంచి క్రేజ్ తెచ్చారు. గతంలో వీరిద్దరూ కలిసి 'దేశముదురు' సినిమా చేశారు. అది అర్జున్‌కు మాస్ ఇమేజ్‌ను పెంచింది.

ఇక తాజా సినిమా 'ఇద్దరమ్మాయిలతో'విషయానికొస్తే సెప్టెంబర్ 20న ముహూర్తం జరుగుతుందని, అక్టోబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని తెలిసింది. టైటిల్‌ను అనుసరించి ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ వరుసలో ఒక హీరోయిన్ గా శ్రుతిహాసన్ ఎంపికైనట్లు కూడా సమాచారం. పూరికి ఒకప్పుడు ఆస్థాన సంగీత దర్శకుడైన చక్రి ఈ చిత్రానికి స్వరాలందించనున్నారు.

ఎప్పటినుంచో పూరీతో సినిమాలు చేయడానికి ఇష్టపడే బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని ఫిలిమ్‌నగర్ వర్గాల సమాచారం. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి. బ్యాంకాక్ లో ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ భాగం జరుపుకోనుందని తెలుస్తోంది. బన్ని సైతం ఈ చిత్రంపై మంచి ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ తన తాజా చిత్రం జులాయి ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు.

తాప్సీ విషయానికి వస్తే ప్రస్తుతం వెంకటేష్ సరసన 'షాడో' లోనూ ఆది పినిశెట్టి సరసన 'గుండెల్లో గోదారి' సినిమాల్లో నటిస్తోంది. అలాగే హిందీలోనూ సిద్దార్ద సరసన నటిస్తూ బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఇక 'ఝుమ్మంది నాదం'లో నన్ను అందంగా చూపించారు కాబట్టే నాయికగా ఆ తరవాత అవకాశాలు అందుకోగలిగాను. ఆ తరవాత అన్నీ వాణిజ్యపరమైన సినిమాల్లోనే నటించాను. వీటి మధ్య 'గుండెల్లో గోదారి' ప్రత్యేకంగా నిలుస్తుంది. మణిరత్నం దర్శకత్వంలో నటించాలనేది నా జీవిత ఆశయం. ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి అంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X