Taraka Ratna సీక్రెట్ లాకర్‌లో ఊహించని వస్తువులు.. అవి చూసి ఖంగుతిన్న భార్య.. సినిమాలోనూ ఇలా చేయరు!
తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరో నందమూరి తారకరత్న ఇటీవలే మరణించిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం కుప్పంలో జరిగిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో అస్వస్థతకు గురవడం.. ఆ తర్వాత అతడికి గుండెపోటు వచ్చిందని డాక్టర్లు గుర్తించడం.. అలా 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తర్వాత తారకరత్న కొద్ది రోజుల క్రితం తుది శ్వాసను విడవడం కలలా జరిగిపోయాయి.
ఈ నేపథ్యంలో ఆయన గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్నాయి. ఇక, తాజాగా తారకరత్న సీక్రెట్ లాకర్ గురించిన ఓ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాలు మీకోసం!

తారకరత్న మరణంతో విషాదం
గుండెపోటుకు గురైన తర్వాత బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో నందమూరి తారకరత్నకు చికిత్సను అందించారు. దీంతో అతడు కోలుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఈ సుదీర్ఘమైన పోరాటంలో తారకరత్న ఓడిపోయాడు. తద్వారా నందమూరి ఫ్యామిలీలో, అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపాడు.

ఒంటరిగా మారిన అలేఖ్య రెడ్డి
నందమూరి తారకరత్న తన తల్లిదండ్రులకు ఇష్టం లేకుండానే వివాహం చేసుకున్నాడు. దీంతో చనిపోయే వరకూ వాళ్లతో సత్సంబంధాలు లేకుండానే ఉన్నాయి. ఇప్పుడు తారకరత్న మరణం తర్వాత అలేఖ్య రెడ్డికి అత్తింటి వారి నుంచి మాత్రం సపోర్ట్ లేకుండా పోయిందని అంటున్నారు. దీంతో ఆమె ఒకరకంగా ఒంటరిగానే మిగిలారని చెప్పొచ్చు.

ముగ్గురు పిల్లలు.. మనో వేదన
తారకరత్న - అలేఖ్య రెడ్డి దంపతులకు మొత్తం ముగ్గురు పిల్లలు జన్మించారు. అందులో పెద్ద అమ్మాయి నిష్క పుట్టిన చాలా ఏళ్ల తర్వాత వీళ్లకు కవలలు జన్మించారు. వాళ్లకు తన్యారామ్, రేయా అని పేర్లు పెట్టారు. మొత్తంగా తన పిల్లలకు NTR పేరు కలిసేలా తారకరత్న నామకరణాలు చేశాడు. ఇక, తండ్రి మరణంతో పిల్లలు మనోవేదనకు గురవుతున్నారు.

చనిపోయిన తర్వాతా వార్తల్లో
నందమూరి తారకరత్న మరణం తర్వాత అతడి గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్నాయి. అతడు ఎదుర్కొన్న సవాళ్లు, అనుభవించిన కష్టాలు, కెరీర్‌లో ఒడిదుడుకులు, ఫ్యామిలీలో గొడవలు, రాజకీయ ప్రయాణం.. ఇలా ఎన్నో రకాల సీక్రెట్లు బయటకు వస్తున్నాయి. దీంతో చనిపోయిన తర్వాత కూడా తారకరత్న పేరు నిత్యం వార్తల్లోనే ఉంటోంది.

తారకరత్న లాకర్ హాట్ టాపిక్
నందమూరి ఫ్యామిలీకి చెందిన తారకరత్న మరణించి రెండు వారాలు కావొస్తుంది. ఇటీవలే అతడి పెద్ద కర్మను కూడా నిర్వహించారు. దీంతో ఇప్పుడిప్పుడే కుటుంబ సభ్యులు, అభిమానులు ఈ ట్రాజెడీ నుంచి బయట పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తారకరత్న సీక్రెట్ లాకర్ అంటూ ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

లాకర్‌లో ఊహించని వస్తువులు
అటు సోషల్ మీడియాలో.. ఇటు సినీ వర్గాల్లో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. తాజాగా శంకరపల్లిలో ఉన్న సొంతం నివాసంలో తారకరత్నకు ఓ సీక్రెట్ లాకర్ ఉన్నట్లు తెలిసింది. దీన్ని తాజాగా అతడి భార్య అలేఖ్య రెడ్డి ఓపెన్ చేసి చూశారని సమాచారం. అందులో కొన్ని విలువైన పత్రాలతో పాటు పెద్ద కూతురు నిష్క వస్తువులను తారకరత్న దాచాడట.

భార్య షాక్.. కూతురు బాధగానే
తమ ప్రేమకు ప్రతిరూపం అని చెప్పుకుంటూ పెద్ద కూతురు నిష్కను తారకరత్న ఎంతో ప్రేమగా చూసుకునేవాడట. అందుకే ఆమె చిన్నప్పుడు వాడిన మొదటి వస్తువులను ఆ లాకర్‌లో దాచుకున్నాడని తెలిసింది. అవి చూసి అలేఖ్య రెడ్డి ఖంగుతిన్నారని అంటున్నారు. అంతేకాదు, నిష్క వాటిని కూడా బాగా ఎమోషనల్ అయిందనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











