Don't Miss!
- Technology
iPhone 14 సహా, రానున్న iPhone సిరీస్‌లలో పలు కీలక మార్పులు!
- News
VIVO: వీవో కంపెనీ డైరెక్టర్లు దేశం వదిలి చైనాకు జంప్,ఈడీ దెబ్బతో జింగ్ జాంగ్,జస్ట్ రూ. 10 వేల కోట్లు గోల్ మాల్
- Lifestyle
Asthma: ఆస్తమాకు సరైన సమయంలో చికిత్స అందివ్వకపోతే..ఈ ప్రధాన సమస్యలతో పాటు ప్రాణాంతకం అని తెలుసుకోండి..
- Finance
Dolo-650: డోలో-650 తయారీదారుపై ఐటీ రైడ్స్.. కీలక పత్రాల పరిశీలన.. 40 ప్రాంతాల్లో..
- Sports
Womens Hockey World Cup 2022: కివీస్‌తో భారత్ కీలక పోరు.. గెలిస్తే క్వార్టర్స్ బెర్త్!
- Automobiles
డీలర్షిప్ చేరుకున్న 'మహీంద్రా స్కార్పియో-ఎన్': బుకింగ్స్ & టెస్ట్ డ్రైవ్స్ వివరాలు
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు..!
మహేశ్ బాబుతో ఎన్టీఆర్: బడా డైరెక్టర్ మాస్టర్ ప్లాన్.. ఊహించని పాత్రలో నందమూరి హీరో
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని.. సుదీర్ఘ కాలంగా టాప్ హీరోగా వెలుగొందుతోన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అతడు.. తన మార్కెట్‌ను కూడా గణనీయంగా పెంచుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు.
ఇక, ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న మహేశ్.. ఇటీవలే 'సర్కారు వారి పాట' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక, ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాలో నందమూరి హీరో కూడా భాగం అవుతున్నాడని తాజాగా దీని గురించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ సంగతులేంటో మీరే చూడండి!

మహేశ్ హ్యాట్రిక్ విజయాలు
మహేశ్ బాబు ఈ మధ్య కాలంలో సూపర్ డూపర్ ఫామ్‌తో దూసుకెళ్తున్నాడు. దీనికి కారణం అతడు చేసిన సినిమాలన్నీ హిట్లు అవడమే. కొరటాల శివతో చేసిన 'భరత్ అనే నేను' నుంచి వరుసగా 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో హ్యాట్రిక్‌ను కూడా అందుకున్నాడు. అలాగే ఎన్నో రికార్డులను నమోదు చేశాడు.
బీచ్‌లో రెచ్చిపోయిన అమలా పాల్: ఏం చూపించకూడదో అదే చూపిస్తూ!

సర్కారు వారి పాట అంటూ
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవలే పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేశాడు. ఈ మూవీలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. దీనికి థమన్ సంగీతం అదిస్తున్నాడు. ఈ సినిమా భారీ స్పందనతో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

మూడోసారి ఆ డైరెక్టర్‌తోనే
హిట్లు మీద హిట్లు కొడుతోన్న మహేశ్ బాబు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే త్వరలోనే అతడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత వీళ్ల కాంబోలో సినిమా రాబోతుండడంతో దీనిపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.
Harihara Veeramallu: ఎన్టీఆర్ మూవీల హరిహర వీరమల్లు.. పవన్ అసంతృప్తి.. ఆగిపోయిన సినిమా!

చాలా ఆలస్యం అవుతోంది
మహేశ్ బాబు.. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయాల్సిన సినిమా ఎప్పుడో మొదలు కావాల్సి ఉంది. కానీ, సర్కారు వారి పాట షూటింగ్ ఆలస్యం అవడంతో ఇది పట్టాలెక్కలేదు. ఇంతలో ఇటీవలే మహేశ్ బాబు మోకాలికి సర్జరీ జరిగింది. ఆ తర్వాత అతడికి కరోనా వైరస్ కూడా సోకింది. దీంతో అతడి షూటింగ్ ప్లాన్స్ మొత్తం మారిపోయాయి. ఫలితంగా ఇది మరింత ఆలస్యం అవుతూ వస్తోంది.

అవన్నీ పూర్తి.. నటులపైనే
సూపర్ స్టార్‌తో చేయబోయే సినిమా విషయంలో త్రివిక్రమ్ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నాడు. ఈ మూవీ కోసం గురూజీ ఇప్పటికే డైలాగ్ వెర్షన్‌తో కూడిన ఫుల్ స్క్రిప్టును రెడీ చేసేశాడని ఎప్పుడో న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు, థమన్ కూడా కొన్ని పాటలు రెడీ చేశాడట. మొత్తంగా ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి.. ఇప్పుడు నటుల ఎంపిక మీద ఫోకస్ చేశాడని తెలుస్తోంది.
స్పోర్ట్స్ బ్రాతో రష్మిక హాట్ సెల్ఫీ: టాప్ టూ బాటమ్ కనిపించేలా ఘాటు ఫోజు

మహేశ్‌తో కలిసిన ఎన్టీఆర్
సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో భాగం కాబోయే నటీనటుల గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ కోసం నందమూరి కుటుంబానికి చెందిన హీరో తారకరత్నను (NTR) తీసుకుంటున్నారని ఓ న్యూస్ లీకైంది.

ఊహించని పాత్రకు సిద్దం
మహేశ్ బాబు కెరీర్లోనే ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రంలో తారకరత్న విలన్‌గా నటించబోతున్నారని కూడా ఓ న్యూస్ లీకైంది. ఇది సినిమాలోనే ఎంతో ముఖ్యమైన పాత్ర అని సమాచారం. అందుకే ఇందులో నటించేందుకు ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలుస్తోంది. ఇక, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి.