Taraka Ratna: ఫైర్ బ్రాండ్ మంత్రిపై తారకరత్న పోటీ.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. ఆ సెంటిమెంట్‌తోనే!
కొంత కాలంగా నందమూరి ఫ్యామిలీలో విషాదకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ కుటుంబానికి చెందిన ఎంతో మంది ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే ఇటీవలే గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న నందమూరి తారకరత్న శనివారం సాయంత్రం తుది శ్వాసను విడిచారు.
ఈ నేపథ్యంలో ఆయన గురించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు తారకరత్న పెట్టుకున్న రాజకీయ కోరిక గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఆ విషయాలను గురించి తెలుసుకుందాం పదండి!

పాదయాత్రలో గుండెపోటు
కుప్పంలో జరిగిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. కొద్ది దూరం నడిచిన ఆయన అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయారు. ఇది గుండెపోటు అని గుర్తించిన వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. అంతేకాదు, ఆయనను బెంగళూరులోని నారాయణ హృదయాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తూ వచ్చారు.

23 రోజులు తర్వాత మృతి
గుండెపోటుకు గురైన తర్వాత నందమూరి తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో 23 రోజుల పాటు చికిత్సను తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన శనివారం సాయంత్రం తుది శ్వాసను విడిచారు. ఆ వెంటనే ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ శంకర్‌పల్లిలోని నివాసానికి తీసుకు వచ్చారు. సోమవారం తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయి.
తారకరత్నకు సంతాపంగా
నందమూరి తారకరత్న మరణంతో సినీ, రాజకీయ వర్గాల్లో విషాద పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఆయన మరణంపై అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అలాగే, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు కూడా సంతాపం తెలుపుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో తారకరత్న మరణంపై పోస్టులు పెడుతూ అనుబంధాన్ని పంచుకుంటోన్నారు.

రాజకీయాల్లో యాక్టివ్‌గానే
చాలా కాలం క్రితమే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తారకరత్న.. తన కెరీర్‌ను ఆశించిన రీతిలో నడుపుకోలేకపోయారు. దీంతో పెద్దగా సినిమాలు కూడా చేయడం లేదు. అయితే, చనిపోవడానికి ముందు ఆయన రాజకీయాల్లో మాత్రం చాలా యాక్టివ్ అయ్యారు. ఈ క్రమంలోనే తన తాత పెట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పని చేశారు. ఇలా ఎన్నో కార్యక్రమాల్లో కూడా భాగం అయ్యారు.

ఎన్నికల్లో పోటీ చేస్తానని
మరణించడానికి ముందు రాజకీయాల్లో చాలా యాక్టివ్ అయిన నందమూరి తారకరత్న వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నట్లు స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన గురించి ఎన్నో రకాల వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి.

ఫైర్ బ్రాండ్ మంత్రిపైనే
నందమూరి తారకరత్న మరణం తర్వాత ఆయన రాజకీయ ప్రయాణం గురించి తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం.. 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఆయన గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేయాలని అనుకున్నట్లు తెలిసింది. అక్కడ ప్రస్తుతం వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతోన్నారు.

ఆ సెంటిమెంట్ ప్రకారం
గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్టీఆర్ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత అక్కడ నుంచి హరికృష్ణ కూడా పోటీ చేశారు. మొత్తంగా అక్కడ నందమూరి ఫ్యామిలీకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ సెంటిమెంట్ ప్రకారమే తారకరత్నతో అక్కడ పోటీ చేయించాలని చంద్రబాబు ప్లాన్ చేసినట్లు, ఇందుకోసం స్థానిక నేతలతో మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











