పవన్ పంజాను గుర్తు చేస్తున్న ఎన్టీఆర్ ‘దయ’!
ఎంత ప్రయత్నించినా సక్సెస్‌లు తనను పలకరించక పోవడంతో నందమూరి తారకరత్న తన పేరును నందీశ్వరుడు సినిమా దగ్గర నుంచి 'ఎన్టీఆర్' అంటూ షార్ట్‌కట్‌గా మార్చుకున్న సంగతి తెలిసిందే. అయినా సరే అతని సక్సెస్ వరించలేదు. తనపై ప్రేక్షకులు దయ చూపండి అంటూ డైరెక్ట్‌గా 'దయ' అనే టైటిల్ తోనే ఈ సారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు ఈ హీరో.
వేగా ఎంటర్‌టైన్‌మెంట్ వారి సమర్పణలో దేవి ఆర్ట్స్ బేనర్‌పై రాణి - విక్రమ్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకి పునీత్ దర్శకత్వం వహిస్తున్నారు. గాయిత్రి అయ్యర్ హీరోయిన్. ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ఒకటి ఇటీవల విడుదలైంది. ఆ ట్రైలర్ సూపర్ గా ఉంది. కానీ అదని పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమాను పోలి ఉందనే టాక్‌ను మూటగట్టుకుంది. సినిమా కూడా పంజా రేంజిలోనే తీశారని అంటున్నారు.
తారకరత్న ప్రస్తుతం 'మైక్ టెస్టింగ్ 123' అనే మరో కామెడీ చిత్రంలోనూ నటిస్తున్నాడు. తారకరత్న, అర్చన, కృష్ణుడు ప్రధాన తారాగణంగా వీరు.కె దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఆర్.ఎ. ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత జాని నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది.
దేవానందం అనే డ్రామా డైరెక్టర్ గా నటిస్తున్నాడు తారక రత్న ఇందులో... తను వేసిన డ్రామాలో గబ్బర్ సింగ్ చిత్రంలోని 'కెవ్వుకేక సాంగు'పై డాన్స్ చేయిస్తాడట. తొలిసారిగా ఆయన ఈ సినిమాలో కామెడీని పండించబోతున్నాడు. ఈచిత్రంతో పాటు 'విజేత' అనే మరో సినిమా కూడా చేస్తున్నా. పి ఉదయ భాస్కర్ దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రాన్ని వి దొరస్వామి రాజు నిర్మిస్తున్నారు. త్రికోణ ప్రేమ కథగా రూపొందుతున్న ఇందులో సంజన మరియు శ్వేత బసు ప్రసాద్ కథానాయికలు.


Click it and Unblock the Notifications











