తారకరత్న హీరో కాదు విలన్!!
వెంకటాద్రి డిజాస్టర్ ప్లాప్ తో తారకరత్నకి ఇక అవకాశాలు రానట్లే అని అంతా బావించారు. అయితే తాజాగా మరో అయితే తాజాగా మరొక అవకాసం అతని తలుపు తట్టింది. అది వరస హిట్ లతో దూసుకుపోతున్న రవిబాబు దర్సకత్వంలో కావటం సంతోసాన్ని ఇచ్చే విషయం. ఐతే ఇక్కడో ట్విస్ట్ ఉంది. అమరావతి పేరుతో తయారయ్యే ఈ సినిమాలో అతనిది విలన్ వేషం. ఇన్నాళ్ళు హీరో గా అతను ఒరగపెట్టింది ఏమి లేక పోవటం తో వెంటనే మారు మాట్లాడ కుండ ఒప్పుకున్నాడని సమాచారం.
ఇక అనసూయ, నచ్చావులే చిత్రాలతో క్రేజ్ సంపాదించుకున్న అల్లరి రవిబాబు త్వరలో ఈ ధ్రిల్లర్ ని ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారు. అమరావతి టైటిల్ తో తయారవన్న ఈ చిత్రం స్క్రిప్టు వర్క్ ఇప్పటికే పూర్తయిందని సమాచారం. గోపీచంద్ తో శౌర్యం వంటి యాక్షన్ చిత్రాన్ని రూపొందించిన భవ్య క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. స్నేహ, భూమిక ప్రధాన పాత్రలుగా ఈ చిత్రం రూపొందించాలని అల్లరి రవిబాబు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల ఇరవై ఆరు నుంచి ఈ ప్రాజెక్ట్ ప్రారంబం కానుంది.


Click it and Unblock the Notifications











