అనసూయతో తరుణ్ భాస్కర్ రొమాన్స్.. విజయ్ దేవరకొండ భలే ఇరికించాడుగా!
Recommended Video

పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన దర్శకుడు తరుణ్ భాస్కర్ త్వరలోనే హీరోగా మారబోతున్నాడు. ఈ సినిమాకు హీరో విజయ్ దేవరకొండ నిర్మాత కావడం విశేషం. తనకు పెళ్లి చూపులు సినిమాతో బ్రేక్ ఇచ్చిన తరుణ్‌ను హీరోగా మార్చే బాధ్యతను భుజానికెత్తుకున్నాడు. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నది. అయితే తరుణ్ భాస్కర్ పక్కన నటించే హీరోయిన్ ఎవరనే వార్త ఆసక్తిగా మారింది. ఇంతకీ హీరోయిన్ ఎవరంటే..

తరుణ్ భాస్కర్‌కు జోడిగా
కామెడీ, ఎంటర్‌టైనర్‌గా, విభిన్నమైన కథతో రూపొందే ఈ సినిమాలో తరుణ్ భాస్కర్‌కు జోడిగా ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ నటిస్తున్నారట. తరుణ్ జోడిగా అనసూయ కరెక్ట్‌గా సూట్ అవుతుందని యూనిట్‌తోపాటు విజయ్ దేవరకొండ అభిప్రాయపడ్డారట. దాంతో అనసూయ ప్రాజెక్ట్‌లో చేరనున్నారట. అయితే అధికారికంగా త్వరలోనే వెల్లడిస్తారనేది ఇన్ సైడ్ టాక్.

తరుణ్ భాస్కర్‌తో అనసూయ రొమాన్స్
తరుణ్ భాస్కర్ హీరోగా నటించే ఈ చిత్ర కథ నాలుగు క్యారెక్టర్ల మధ్య సాగుతుందంట. తరుణ్‌తో జోడిగా నటించే క్యారెకర్ట్‌తో మంచి రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయనేది తాజా టాక్. సో అనసూయ్ కన్ఫర్మ్ అయితే వారిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ కావడం గ్యారెంటీ అంటున్నాయి సినీ వర్గాలు.

బిజినెస్‌పై విజయదేవరకొండ దృష్టి
గీతా గోవిందం, టాక్సీవాలా లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఓ వైపు సినిమాలను చకచకా పూర్తి చేస్తూనే బిజినెస్ కార్యక్రమాలపై కూడా దృష్టిపెట్టాడు. రౌడీ బ్రాండ్‌ను మార్కెట్‌లోకి తెచ్చి యూత్‌ను విశేషంగా ఆకర్షించాడు. ప్రస్తుతం ఫ్యాబ్రిక్ మార్కెట్‌లో రౌడీ క్రేజీ ప్రొడక్ట్‌గా మారింది. ఇలా రకరకాల వ్యవహారాలను సమర్దంగా నిర్వహిస్తూనే సినీ నిర్మాణంలోకి అడుగుపెడుతున్నాడు.

సొంత బ్యానర్లో మూవీ
అలాగే సొంత బ్యానర్, ప్రొడక్షన్‌తో విజయ్ దేవరకొండ ఓ చిన్న బడ్జెట్ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ చిత్రంలో తన కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను హీరోగా మార్చబోతుండటం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications











